దళిత బంధు ద్వారా ఎంపిక చేసిన యూనిట్ల లబ్దిదారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

   బుధవారంనాడు హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్ ఆవరణలో జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ది సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గస్థాయి దళిత బంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా మంత్రులు, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్  రెడ్డి,  రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తదితరలు  లబ్దిదారులకు అందించిన ట్రాక్టర్లను స్వయంగా డ్రైవింగ్ చేశారు.
   అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్  రెడ్డి మాట్లాడుతూ, సమస్త తెలంగాణను అభివృద్ది చేస్తున్నందున దళితులను కూడా ఆర్థిక బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ దళిత బంధు పథకంను తీసుకువచ్చారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత కుటుంబానికి పది లక్షల  రూపాయలు ఇస్తున్న  రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన తెలిపారు. అదే విధంగా అంబేద్కర్ కల సాకారం కావాలంటే దళిత కుటుంబాలు బాగు పడాలంటే విద్య ద్వారనే సాధ్యం అన్నారు. అందుకోసం  రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను స్థాపించి అన్ని సౌకర్యాలతో విద్యను ఉచితంగా అందిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
     జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ, దళిత బంధు పథకంలో ఎంపికైన కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించి ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాక్షించారు.  ఈ పథకంలో భాగంగా ఎంపికైన  యూనిట్ల వారీగా ప్రగతి సాధించి ఆదర్శంగా నిలవాలని ఆయన లబ్దిదారులను కోరారు. వాహనాలు అందించిన వారికి 15  రోజులలోగా లైసెన్సు పొందే విధంగా ఆర్.డి.ఓ., ఎం.పి.డి.ఓ.లు చర్యలు తీసుకుని ఆర్.టి.ఓ. ద్వారా మంజూరు చేయించాలని తెలిపారు.  అదే విధంగా ఎం.పి.డి.ఓ.లు వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్సు మొదలగుని చేయించే పూర్తి బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇచ్చిన వాహనాలను అమ్మడం లాంటివి చేయకూడదని లబ్దిదారులను కోరారు. వాహనాలు కాకుండా ఇతర  యూనిట్లకు ఎంపికైన వారు కూడా సమిష్టిగా కష్టపడి పథకం ఫలాలు పొందాలని ఆయన తెలిపారు.
      కార్యక్రమంలో భాగంగా  రవాణాకు సంబంధించిన 24 ట్రాక్టర్లు, 3 డోజర్లు, ఆటో ట్రాలీలు 8, 10 కార్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఇతర  యూనిట్లైన 5 మిని డైరీ ఫామ్ లు, 9 కోళ్ల ఫారమ్ లు, 1 మేకల పెంపకం, 4 క్యాటరింగ్ సర్వీసులు, 1 భవన నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి, 1 ఆయిల్ మరియు ఫ్లోర్ మిల్లు, 3 మిని సూపర్ బజార్లు, 2 ఎలక్ట్రికల్, 1 ఫర్టిలైజర్ అండ్ ఫెస్టీసైడ్స్, 1 హార్డువేర్ షాప్, 2 డి.టి.పి. సెంటర్లు, 1 డయాగ్నస్టిక్ సెంటర్, 3 టెంట్ హౌస్, 1 సిమెంట్ షాప్, 1 ఆఫ్టికల్ షాప్, 3 క్లాత్ ఎంపోరియం, 1 పేపర్ ప్లేట్స్ యూనిట్ మొత్తం ట్రాన్సుపోర్టు 40  యూనిట్లు కాగా, నాన్ ట్రాన్సుపోర్టు  యూనిట్లు 42 ఉన్నాయని వివరించారు.
నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ మండలం నుండి చెట్లచెన్నారంలో 19 మందికి, నల్లగొండ మండలం నుండి రాములబండలో 17 మందికి,  రంగారెడ్డి నగర్ లో 12 మందికి, తిప్పర్తి మండలం నుండి ఎల్లమ్మగూడెం లో 25 మందికి యూనిట్లకు సంబంధించిన ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్  రెడ్డిలు లబ్దిదారులకు అందజేశారు.
     ఈ సమావేశంలో ఆర్.డి.ఓ.  జగదీశ్వర్  రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశం, ప్రజా ప్రతినిధులు నాగులవంచ విజయలక్ష్మీ, కరీం పాషా, జెడ్.పి.టి.సి.లు, ఎం.పి.పి.లు, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్ లు, ఎం.పి.డి.ఓ.లు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

దళిత బంధు ద్వారా ఎంపిక చేసిన యూనిట్ల లబ్దిదారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

Share This Post