దళిత బంధు ద్వారా మొదటి విడతలో గ్రౌండింగ్ అయిన యూనిట్ల ను, క్షేత్రస్థాయిలో వాటి తీరుతెన్నుల వివరాలను నమోదు చేసేందుకే తెలంగాణ దళిత బంధు యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఈ యాప్ లో అన్నీ వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులును ఆదేశించారు

ప్రచురణార్థం

వరంగల్

మొదటి విడతలో దళిత బంధు ద్వారా గ్రౌండింగ్ అయిన యూనిట్లపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు సరిగా ఉపయోగించుకుంటున్నారా లేదా
అనే విషయంపై గురువారం వివిధ మండలాల ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్స్ తో జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ బి. గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్థికచేయుతే లక్ష్యంగా దళిత బందు ప్రారంభించిందని…దీని ద్వారా మన జిల్లా లో
303 యూనిట్లు గ్రౌండ్ చేయడం జరిగిందని…
గ్రౌండింగ్ అయిన యూనిట్లతో దళిత కుటుంబాలు ఎలా ఉపయోగించుకుంటున్నాయి, గ్రౌండింగ్ అయిన యూనిట్ల ను సంబంధిత మండల అభివృద్ధి అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదికలు అందించినట్లు చెప్పారు

దళిత బంధు యాప్ లో దళిత బంధు గ్రౌండింగ్ అయిన
యూనిట్ల వివరాలను నమోదు చేసేందుకు సంబంధిత ఎంపీడీవోలు,మునిసిపల్ కమిషనర్స్ కు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగిందని… పంచాయతీ సెక్రటరీలు కూడా దళిత బంధు గ్రౌండింగ్ అయిన యూనిట్ల వివరాలను, ఫోటోలు,వీడియోలు అప్లోడ్ చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల్లో జరుగుతుందని… మన జిల్లాలో కూడా
నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు

రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు అప్లికేషన్స్ మీసేవ ద్వారా అప్లై చేయడానికి అవకాశం కల్పించిందని చెప్పారు

అలాగే గ్రౌండ్ అయిన యూనిట్ల వివరాల రికార్డులను లబ్ధిదారులు సరిగా రాస్తున్నారా లేదా, రికార్డుల ద్వారానే ఎంతవరకు యూనిట్ లబ్ధి పొందారు అనే విషయాన్ని గమనించవచ్చన్నారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ కుమార్,డి ఆర్ డి ఎ పి డి సంపత్ రావు సంబంధిత మండల అభివృద్ధి అధికారులు మునిసిపల్ కమిషనర్స్ పాల్గొన్నారు

Share This Post