దళిత బంధు పథకంతో మీతో పాటు కుటుంబ సభ్యుల బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*దళిత బంధు పథకం తో…*
*మీతో పాటు కుటుంబ సభ్యుల బంగారు* *భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలి*

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
——————————

మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు, పెద్దగా ఆలోచించాలి..
దళిత బంధు పథకంలో భాగంగా లాభదాయక యూనిట్ లను స్థాపించి
మీతో పాటు కుటుంబ సభ్యుల బంగారు* భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి లబ్దిదారులకు మార్గదర్శనం చేశారు.

గురువారం IDOC మినీ మీటింగ్ హల్ లో ఎల్లారెడ్డి పేట మండలం పదిర గ్రామానికి చెందిన 18, వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన 17 మంది మొత్తం 35 మంది దళిత బంధు పథకం లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ సమావేశం అయ్యారు.

మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలో
ఒక్కో లబ్దిదారుడితో జిల్లా కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. ఎంపిక చేసుకున్న యూనిట్ లు, అనుభవం, ఆసక్తి , డిమాండ్, నిర్వహణ ప్రణాళిక , మార్కెటింగ్, ఉద్యోగ కల్పన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధి జాబ్ కార్డు కలిగి కూలిగా పనిచేస్తున్న మీకు మరో నలుగురికి ఉపాధి నిచ్చేలా ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా దళిత బంధు ద్వారా యూనిట్ ల స్థాపనకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి యూనిట్ ను సక్సెస్ చేసేలా చూడాలన్నారు. మొక్కలను జాగ్రత్తగా పెంచే వృక్షాలుగా ఎదిగేలా చూసినట్టు…. వ్యాపారం వృద్ధి నీ సాధించాలని అన్నారు.
లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ లకు సంబంధించి రికమెండే ష న్ రిపోర్ట్ ను వెంటనే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. లబ్దిదారులు మోస పోకుండా
వెండర్ లతో అధికారులే మాట్లాడాలని అన్నారు. నాణ్యమైన వస్తువులు సరఫరా చేసేలా చూడాలన్నారు. వారంటీ,గ్యారంటీ లను పరిశీలించాలన్నారు.
యూనిట్ ల గ్రౌండింగ్ పురోగతిని బట్టి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.

 

*బండ్లే కొంటాం అంటే నష్ట పోతారు*

-ఉమ్మడి గా లాభదాయక వ్యాపారాలు చేపట్టవచ్చు

 

దళితబంధు నిధులతో కార్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే నష్టపోతారు.
ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లో వాహనాలు, బండ్లు తీసుకుంటే 5 ఎండ్లలో వాటి విలువ గణనీయంగా తగ్గుతుందన్నారు
దళితబంధు నిధులతో పలు రకాల వ్యాపారాలు చేస్తామని లబ్ధిదారులు అంటున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేస్తే మరింతగా వృద్ధి సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ లబ్దిదారులకు తెలిపారు. రాష్ట్రంలో దళితబంధు నిధులతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చునని… రూపాయి పెట్టుబడితో రూపాయిన్నర రాబడి గురించి ఆలోచించాలనీ విడమర్చి చెప్పారు. జిల్లా కలెక్టర్ కౌన్సిలింగ్ తో ఇదివరకే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లో యూనిట్ లను ఎంపిక చేసుకున్న లబ్దిదారులు మనసు మార్చుకున్నారు. ఇతర యూనిట్ లను ఎంపిక చేసుకున్నారు.

*పదిర దళిత బంధు లబ్దిదారులు భేష్*

ప్రోగ్రెసివ్ ఆలోచనలతో
వృద్ధి అధికంగా ఉండే యూనిట్ లను, ఉమ్మడి యూనిట్ లను పదిర దళిత బంధు లబ్దిదారులు ఎంపిక చేసుకున్నారు. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు.
దళిత బంధు లో పదిర లబ్దిదారులు తెలంగాణ కే నమూనాగా, ఆదర్శంగా నిలవాలన్నారు. వచ్చే సంవత్సరం ఎంపిక చేసే లబ్దిదారులకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాలన్నారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ , ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు వినోద్, drdo మదన్ మోహన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ , జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి కొమురయ్య, ఎల్లారెడ్డి పేట ఎంపిడివో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
——————————

Share This Post