దళిత బంధు పథకంపై సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.       తేది:22-12-2021, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వం దళితులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఎస్.సి.లు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దళిత బంధు పథకంపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని, అందులో 100 మంది దళితులను ‘దళిత బందు’ పథకానికి అర్హులుగా ఎంపిక చేయటం జరుగుతుందని ఆమె అన్నారు.
వనపర్తి జిల్లాలో 22,443 మంది 16.67% దళితులు ఉన్నారని జిల్లా కలెక్టర్ వివరించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి పేద దళితులను గుర్తించి, వారికి వారి అకౌంట్లలో రూ.10 లక్షలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా వారికి ఏదైనా ప్రమాదం జరిగినా, ఆ కుటుంబంలోని సభ్యులకు కార్పస్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని ఆమె అన్నారు. ఆర్థిక సహాయం అందుకున్న కుటుంబాలు వారికి నచ్చిన పనిలో శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించి లబ్ధి పొందవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా యువతలో స్వయం ఉపాధి పొందే వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
దళిత బంధు పథకం కింద ప్రతి యూనిట్ కు రూ.10 లక్షల వరకు అందించడం జరుగుతుందని, ఈ పథకాన్ని 100 శాతం పకడ్బందీగా జిల్లాలో అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, జిల్లా అధికారులు నుసిత, అనిల్, డి ఆర్ డి ఓ నరసింహులు, అధికార్లు, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post