దళిత బంధు పథకం అమలు పై క్లస్టర్ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగ్రవాల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక.

దళిత బంధు పథకం అమలుపై అధికారులతో సమీక్ష

మిగిలిన అర్హులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాము

జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్

000000

హుజూరాబాద్ నియోజకవర్గం లో అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో అర్హులై ఉండి ఇంకా డబ్బులు రాని లబ్దిదారుల ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

గురువారం దళిత బంధు పథకం అమలు తీరుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్లస్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు డబ్బులు జమ కానీ అర్హులైన కుటుంబాల లబ్ధిదారులకు వెంటనే ఖాతాలు తెరిపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అర్హులైన లబ్ధిదారులకు అందరికీ మరో రెండు రోజుల్లో దళిత బంధు పథకం డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్ (స్థానిక సంస్థలు), జడ్పీ సీఈవో ప్రియాంక, ఎల్ డి యం లక్ష్మణ్, క్లస్టర్ అధికారులు పాల్గొన్నారు.

Share This Post