దళిత బంధు పథకం కింద పాడి గేదెలు హర్యానా రాష్ట్రం రోహతాక్ జిల్లాలోని బోహార్ గ్రామంలో కరీంనగర్ డైరీ అధికారుల సమక్షంలో పాడి గేదెలను కొనుగోలు చేస్తున్న ఇల్లంతకుంట మండలం కొత్తూరు జయ భర్త మొగిలి,హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి రాధా భర్త మొగలి.

దళిత బంధు లబ్ధిదారులు డైయిరీ యూనిట్లు ఎంచుకుంటే లాభదాయకం

హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారులు స్వయం ఉపాధి పథకాలలో భాగంగా డైయిరీ యూనిట్లను ఎంచుకుంటే వెంట వెంటనే తక్కువ సమయంలో ఆదాయం వస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద, దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలేట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆగష్టు 16 న హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలలో 21 వేల దళిత కుటుంబాలను గుర్తించి వారందరికి దళిత బంధు పథకం క్రింద 10 లక్షల చొప్పున మంజూరు చేయుటకు ప్రభుత్వం నిర్ణయించింది. దళిత బంధు పథకం క్రింద లబ్ధిదారులు 30 రకాల స్వయం ఉపాధి పథకాలను ఎంచుకొనుటకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దళిత బంధు లబ్ధిదారులందరికి బ్యాంకులలో ప్రత్యేక దళిత బంధు ఖాతాలను తెరిపించారు. ఇంతవరకు హుజురాబాద్ నియోజకవర్గంలో 14,421 మంది లబ్ధిదారుల ఖాతాలలో దళిత బంధు నిధులు ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన అర్హులైన లబ్ధిదారులందరికి ప్రతి రోజు వారి ఖాతాల్లో దళిత బంధు నిధులు జమ చేస్తున్నారు.
దళిత బంధు పథకంలో లబ్ధిదారులు వేర్వేరు యూనిట్లు ఎన్నుకోకుండా పాడిగెదేల యూనిట్లు ఎన్నుకుంటే మంచిదని జిల్లా యంత్రాంగం అభిప్రాయపడింది. డైయిరీ యూనిట్లు ఎన్నుకున్న లబ్ధిదారులకు పాడి పరిశ్రమల నిర్వాహణలో శిక్షణ ఇప్పించి, పాడి గేదెల షెడ్ల నిర్మాణానికి ముందుగానే లక్ష రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తుంది. డైయిరీ యూనిట్ల లబ్ధిదారులను కరీంనగర్ డైయిరీ వారితో అనుసంధానం చేసి వారు ఎన్నుకున్న పాడి గేదెలను ఇతర రాష్ట్రాలకు లబ్ధిదారులను తీసుకువెళ్లి వారికి నచ్చిన పాడి గేదెలను కొనుగోలు చేసి గ్రౌండింగ్ చేయుటకు అధికారులు కార్యచరణ ప్రణాళికలు రూపొందించారు. పాడి గేదెలకు వెంటనే ఇన్సూరెన్స్ కూడా అధికారులు చేయిస్తారు. ప్రతి రోజు పాలు కెంద్రానికి తీసుకువెళ్లుటకు వీలుగా టి.వి.ఎస్. చాంపో వాహనం ఈ పథకంలో కొనుగోలు చేసి ఇస్తారు.
కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ డైయిరీ లాభాల భాటలో విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రతి
రోజు కరీంనగర్ డైయిరీ వారు 2 లక్షల లీటర్లు సేకరిస్తున్నారు. త్వరలో తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానముతో రెండవ కరీంనగర్ డైయిరీ యూనిట్ ని ప్రారంభించనున్నారు. ఈ నల్లగొండ డైయిరీ ప్రతి రోజు 3 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తారు. అందుకే జిల్లాలో ఎన్ని పాడి గేదెల యూనిట్లు ఉన్న పాల పాడి రైతులు తమ పాలను అదే గ్రామంలో కరీంనగర్ డైయిరీకి అమ్ముకోవచ్చును. పాడి రైతులకు కరీంనగర్ డైయిరీ వారు ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తారు. దీని ద్వారా ఒక నెలలో పాడి రైతులకు రెండు సార్లు జీతం వచ్చినట్లు అవుతుంది.

కరీంనగర్ డైయిరీ ద్వారా పాడి రైతులకు ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు అమలు:
దళిత బంధు లబ్ధిదారులు పాడి గేదెల యూనిట్లను ఎన్నుకొని గ్రౌండింగ్ అయిన తర్వాత కరీంనగర్ డైయిరీలో సభ్యులుగా చేరినట్లైతే ఈ క్రింది పథకాలు వర్తిస్తాయి.
1. కొత్తగా పాడి పశువులను కొనుగోలు చేయుటకు 50,000/- ల నుండి 60,000/- వేల వరకు రుణ సదుపాయం.
2. ఇతర రాష్ట్రాలలో పాడి పశువులు కొనుగోలు చేసిన వాటికి ఇన్సూరెన్సులో 90 శాతం రాయితీ.
3. ఇతర రాష్ట్రాలలో కొనుగోలు చేసిన పాడి పశువులకు రవాణా చార్జీలలో 90 శాతం రాయితీ
4. పాడి పశువులు మరణిస్తే 5,000/- ల నుండి 7,000/- వరకు ఆర్థిక సహాయం.
5. పాడి రైతుల ఇంటి వద్దనే ఉచిత పశు వైద్యం, రైతు ఇంటి వద్దనే 100/- రూ.ల కే కృత్రిక గర్భధారణ.
6. ప్రతి మూడు నెలలకు ఒకసారి మిని పశు వైద్య క్యాంపులు.
7. ప్రతి సంవత్సరానికి ఒకసారి మెగా పశు వైద్య క్యాంపులు
8. అత్యవసర చికిత్సకు అంబులెన్స్ ద్వారా 250/- ల ఫీజుతో ఇంటి వద్దనే మందులతో సహా చికిత్స .
9. 50 శాతం సబ్సిడీ పై పశువులకు జబ్బా వాపు, గొంతు వాపు, గాలి కుంటు వ్యాధి, తైలేరియాసిస్ టీకాలు
10. పాడి రైతు కూతూరు పెళ్ళికి కళ్యాణ మస్తు క్రింద బంగారు పుస్తే, వెండి మట్టెలు డైయిరీ కానుక.
11. పాడి రైతు భరోసా పథకంలో చేరిన పాడి రైతు కాని అతని భార్య కాని మరణించినచో ఆ కుటుంబానికి 50,000/- ఆర్థిక సహాయం.
12. పాడి రైతు భరోసా పథకంలో చేరిన వారి పిల్లలకు స్కాలర్ షిప్ లు పంపిణి.
13. పాల నిధి పథకం క్రింద 60 సంవత్సరములు పైబడిన పాడి రైతులకు పెన్షన్ లేదా జమ కూడిన డబ్బును ఏకమొత్తంగా చెల్లింపు.
14. రుణం తీసుకున్న రైతు మరణిస్తే పాడి రైతు సంక్షేమ నిధి క్రింద 30,000/- ల ఆర్థిక సహాయం.
15. విద్యా ప్రోత్సహాల క్రింద ఇంటర్మిడియేట్ లో 1వ, ర్యాంక్ వచ్చిన పిల్లలకు 10,000/-, 2 వ, ర్యాంకు వచ్చిన వారికి 8,000/- , 3 వ, ర్యాంకు కు 5,000/- పంపిణి.
16. పాల కెంద్ర భవన నిర్మాణానికి 50,000/- ల నుండి లక్ష రూపాయల వరకు చేయూత.
17. సరసమైన ధరలకు నాణ్యమైన ఎరువులు పాల సంఘాల ద్వారా సరఫరా.
18. పాడి రైతు దహన సంస్కారాలకు 5,000/- చొప్పున చేయూత.
19. అధిక పాల దిగుబడి పశు ఆరోగ్యానికి 25 శాతం సబ్సిడీ పై లవణ మిశ్రమము సరఫర
20. పాలలో వెన్నె శాతం పెరుగుటకు 35 శాతం సబ్సిడీ పై అమృత్ ప్లస్ సరఫర
21. పశు ఆరోగ్యానికి మరియు అధిక పాల దిగుబడి పాల జ్వరం రాకుండా సరసమైన ధరకే కాలిష్యం.
22). 50 శాతం సబ్సిడి పై పశు గ్రాస విత్తనాలు సరఫర
23. మేత వృధాను అరికట్టుటకు 50 శాతం సబ్సిడి పై చాప్ కట్టర్లు పంపిణీ.
24. ధాన ఖర్చు తగ్గించుకొని అధిక పాల ఉత్పత్తి సాధించడానికి ఉచిత ఆజోల్ల కల్చర్ సరఫర
25. పాడి రైతులకు లాభా పేక్ష లేకుండా నాణ్యమైన పశు ధాన సరఫర

పాడి పశువుల యూనిట్లు ఎన్నుకున్న దళిత బంధు లబ్ధిదారులందరూ కరీంనగర్ మిల్క్
ప్రోడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (కరీంనగర్ డైయిరీ భాగస్వామ్యంలో చేరి సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుంటూ శీఘ్రంగా ఆర్థికాభివృద్ధి సాధించాలి.

 

Share This Post