దళిత బంధు పథకం కింద పాడి గేదెలు కొనుగోలు చేసేందుకు హర్యానా రాష్ట్రం రోహతాక్ జిల్లాలోని బోహార్ గ్రామంలో కరీంనగర్ డైరీ అధికారుల సమక్షంలో పాడి గేదెలను కొనుగోలు చేస్తున్న ఇల్లంతకుంట మండలం కొత్తూరు జయ భర్త మొగిలి,హుజూరాబాద్ మండలం kanukula గిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి రాధా భర్త మొగలి.

పాడి గేదెల కొనుగోలుకు హర్యానా వెళ్లిన  దళిత బంధు లబ్ధిదారులు
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0000
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం క్రింద పాడి గేదెల యూనిట్లు ఎంచుకున్న వారికి పాడి గేదెలను కొనుగోలు చేయుటకు జిల్లా యంత్రాంగం లబ్ధిదారులతో పాటు అధికారులు, కరీంనగర్ డైయిరీ అధికారులు హరియాన రాష్ట్రం వెళ్లి పాడి గేదెలను కొనుగోలుకు హరియాన వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగష్టు 16 న హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా 15 మంది ఎంపిక చేసిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా దళిత బంధు చెక్కులు అందజేశారని ఆయన తెలిపారు. ఆ 15 మంది దళిత బంధు లభ్దిదారుల్లో డైయిరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న ముగ్గురికి షెడ్లు నిర్మించుకొనుటకు లక్ష రూపాయల చొప్పున మంజూరు చేశామని తెలిపారు. కరీంనగర్ డైయిరీ సహకారంతో జిల్లా అధికారులు, లబ్ధిదారులకు మేలైన పాడి పశువులను కొనుగోలు చేయుటకు ఇల్లందకుంట మండలం కొత్తూరి జయ, భర్త మొగిలి, హుజురాబాద్ మండలం కనుకులగిద్దె గ్రామానికి చెందిన కొత్తూరి రాధ, భర్త మొగిలి, కమలాపూర్ మండలం, శనిగారం గ్రామానికి చెందిన రాజేందర్ లను కరీంనగర్ డైయిరీ పశువుల డాక్టర్ రహీం అక్తర్, మండల పంచాయితీ అధికారి రవీ లబ్ధిదారులను తీసుకొని హరియాన రాష్ట్రంలోని రోహతక్ జిల్లాకు శుక్రవారం బయలుదేరి శనివారం చేరుకొని జిల్లాలోని దనాన, బీహల్ గ్రామాలలో పాడి గేదెలను పరిశీలించినారు. అనంతరం బోహర్ గ్రామంలో లబ్ధిదారులు తమకు నచ్చిన పాడి గేదెలను కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వారు హర్యాన నుండి పాడి పశువులతో జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంజూరు చేసిన 15 మంది లబ్ధిదారులలో నాలుగు యూనిట్లు గ్రౌండింగ్ అయినట్లు తెలిపారు. ఇందులో గుల్లి సుగుణ అశోక లీలాండ్ ట్రాలీ రాచపల్లి శంకర్, కార్, ఎల్కపల్లి కొమురమ్మ ట్రాక్టర్, దాసారపు స్వరూప ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

.

Share This Post