దళిత బంధు పథకం గ్రౌండింగ్ పై  క్లస్టర్ మరియు సంబంధిత శాఖల అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న  కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

జనవరి 1 న దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ కు సిద్దం చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
00000

హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్లను జనవరి 1 న గ్రౌండింగ్ చేయుటకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్, యూనిట్ల ఎంపికపై క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లు, ఎంపిడిఓలు, తహశిల్దార్లతో సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు పథకం కింద జేసిబి, హార్వెస్టర్, టాటా ఇటాచి, డిసియం వాహనాలు 10 మంజూరైనట్లు, వాటిని జనవరి 1 న గ్రౌండింగ్ చేయుటకు చర్యలు గైకొనాలని ఆదేశించారు. యూనిట్ కాస్ట్ ఎక్కువ ఉన్నచో ఇద్దరు, ముగ్గురు లబ్దిదారులతో కలిపి యూనిట్ మంజూరు చేయవచ్చని ఆయన తెలిపారు. దళీత బంధు యూనిట్లను గ్రౌండింగ్ కమిటీ సభ్యుల సహకారంతో అధికారులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. దళిత బంధు పథకం కింద క్లియర్ గా ఉన్న డెయిరీ యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దళిత బంధు యూనిట్ల ఎంపిక, గ్రౌండింగ్ ల ఎంపిడిఓలు, క్లస్టర్ ఆఫిసర్ల పాత్ర కీలకమని అన్నారు. అధికారులు దళిత బంధు లబ్దిదారులతో చర్చించి మార్కెట్ కు అనుగుణంగా లాభాలు వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. దళిత బంధు పథకాన్ని అధికారులు అధిక ప్రాధాన్యతనిచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారుల అభిరుచులు, నైపుణ్యత ఆధారంగా యూనిట్లను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

Share This Post