దళిత బంధు పథకం గ్రౌండింగ్ పై మున్సిపల్ కమిషనర్లు, MPDO లు, బ్యాంకర్ల లతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్, శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా ప్రజా పరిషత్ CEO ప్రియాంక.

దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్ వేగంవంతగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

000000

దళిత బంధు పథకం ద్వారా లబ్దిదారులకు మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండుర్, చొప్పదండి మరియు కరీంనగర్ నియోజకవర్గాల గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో దళిత బంధు పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో దళిత బంధు పథకం ద్వారా లబ్దిదారులకు మంజూరైన యూనిట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాలల్లో లబ్దిదారుల అక్కౌంట్లో డబ్బులు జమ అయినప్పటికి గ్రౌండింగ్ ఆలస్యంగా జరుగుతుందని, లబ్దిదారులను పిలిపించి యూనిట్లను గ్రౌండింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో దళిత బంధు యూనిట్లు శనివారం లోగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దళిత బంధు పథకం ద్వారా లబ్దిదారులకు ఎన్ని యూనిట్లు మంజూరు అయినవి, కానివి తెలుసుకొని వాటిని త్వరగా పూర్తి అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ (లోకల్ బాడీస్), శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ ప్రియాంక, జిల్లా నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, ఎల్.డి.యం. ఆంజనేయులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post