పత్రికా ప్రకటన. తేదీ: 21-12-2021
కరీంనగర్
దళిత బంధు పగడ్బందీగా అమలు చేయాలి
డైరీ యూనిట్లకు అధిక ప్రాధాన్యత
ఇద్దరు లేదా ముగ్గురు కలిసి యూనిట్ పెట్టుకోవచ్చు
గ్రామ గ్రామాన అవగాహన సమావేశాలు
శిక్షణా కార్యక్రమాలు ఏర్పాట
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
0000
దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు పథకం పై క్లస్టర్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా 100% అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. డైరీ యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఇంతకుముందు పెట్టుకున్న యూనిట్లలో ఏమైనా మార్పులు ఉంటే సరి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. పదిమంది ఒక బృందంగా ఏర్పడి కూడా యూనిట్లను స్థాపించుకుని వీలుందని అన్నారు. మినీ డైరీ కోసం 20 మంది ఒక బృందంగా ఏర్పడి సొసైటీ ఏర్పాటు చేసుకొని డైరీ యూనిట్లు స్థాపించుకునుటకు ముందుకు వచ్చారని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు గ్రామాల వారిగా వారు స్థాపించుకునే యూనిట్ల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్ లేదా హైదరాబాదులో శిక్షణ కూడా ఇప్పిస్తామని అన్నారు.
దళిత బంధు పథకాన్ని పక్కాగా, పకడ్బందీగా అమలు చేయాలని ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు తమ యూనిట్లను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకునే వీలుందని కలెక్టర్ స్పష్టం చేశారు. దళిత బంధు లబ్ధిదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించెందు కోసం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ను హుజురాబాద్ లో కూడా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి సురేష్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, డి ఆర్ డి ఓ శ్రీలత, క్లస్టర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.