దళిత బంధు పథకం తో నిరుపేద షెడ్యూలు కులాల ఆర్ధిక స్థితి గతులు మెరుగుపరచాలి…

ప్రచురణార్థం

దళిత బంధు పథకం తో నిరుపేద షెడ్యూలు కులాల ఆర్ధిక స్థితి గతులు మెరుగుపరచాలి…

మహబూబాబాద్, డిసెంబర్ -20:

దళిత బంధు పథకంతో నిరుపేద షెడ్యూల్ కులాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో దళిత బంధు, ప్రభుత్వ కార్యాలయాలలో మౌఌక సదుపాయాల కల్పన, ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం లపై జిల్లా అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ శాఖల నుండి దళిత బంధు పథకం అమలు పరిచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలియజేశారు.

నిరుపేద దళిత కుటుంబాలలో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నందున, అందుకు తగిన పథకాలను రూపొందించి అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలలో మౌఌక వసతుల కల్పనపై సమీక్షిస్తూ కార్యాలయానికి రెయిలింగ్ తో కూడిన ర్యాంపును  ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్యాలయానికి వీల్చైర్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం బోర్డు, సిటిజన్ చార్ట్, ఉద్యోగుల విధులు వివరాలు తెలియజేసే చాట్ లను  ప్రదర్శింప జేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post