దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో మార్పులు
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
000000


దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో మార్పులు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజూరాబాద్, మానకొండుర్, చొప్పదండి మరియు కరీంనగర్ నియోజకవర్గాల క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో దళిత బంధు పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారుల జాబితాను ఒకసారి పున:పరిశీలన చేసుకోవాలని, క్లస్టర్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మానకొండూర్, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాలలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాలు, డెయిరీ యూనిట్లు, ఇతర షాపులకు సంబంధించిన యూనిట్లను ఎంపిడిఓ, మున్సిపల్ కమీషనర్లు, క్లస్టర్ అధికారులు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. వాహనాలకు బ్యాడ్జి లైసెన్స్ తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ (లోకల్ బాడీస్), శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ ప్రియాంక, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత రెడ్డి, షెడ్యుల్డ్ కులాల అభివృద్ది అధికారి నతానియేలు, వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి రాజమనోహర్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్, డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫిసర్ రాజవీర్, మెప్మా పీడీ రవిందర్, జిల్లా నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, జిల్లా పశువైద్య అధికారి నరేందర్, ఎల్.డి.యం., క్లస్టర్ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.