దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది

దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.మొదటి విడతలో ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి మొత్తం రూ.1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వారం రోజుల్లోపు మరో రూ.1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సీఎం ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.

Share This Post