: దళిత బంధు పథకం ప్రొసీడింగ్స్ మరియు గ్రౌండింగ్ పై క్లస్టర్ మరియు మండల MPDO లు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా ).

 

దళిత బంధు యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు వేగవంతంగా డబ్బులు విడుదల చేయాలి

యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
Oo0

హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకం కింద యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు వేగవంతంగా డబ్బులు విడుదల చేయాలని, యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో
దళిత బంధు పథకం అమలుపై క్లస్టర్ అధికారులు, గ్రౌండింగ్ అధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారులు స్వయం ఉపాధి కింద లాభసాటి యూనిట్లు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండి అనుభవం ఉన్నవారికి వేగవంతంగా 50 శాతం డబ్బులు విడుదల చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫార్మసీ, ఆటో మొబైల్స్, ఫోటో స్టూడియో, సెంట్రింగ్, డైరీ, పేపర్ ప్లేట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, క్లాత్ షోరూమ్స్ లాంటి లాభసాటిగా ఉండే యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు డబ్బులు విడుదల చేసి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని అన్నారు. 3 గురు లేదా 4 గురు కలసి సూపర్ మార్కెట్ పెట్టుకుంటామని ముందుకు వస్తే వారికి సరి అయిన ప్రదేశము, ప్రధాన రహదారి ప్రాంతంలో సూపర్ మార్కెట్ పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ట్రాన్స్ పోర్ట్ వాహనాలను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు తమ యూనిట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని, వారు పాడి గేదేలు లేదా ఇతర లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేందుకు తగిన సూచనలు సలహాలు అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 10వ తేదీలోగా సగానికి పైగా యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారులు ఇదివరకే వ్యాపారం చేస్తుంటే వారి వ్యాపారం విస్తరణ కొరకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. జెసిబి, హార్వెస్టర్, డి సి ఎం వాహనాల కొనుగోలు కోసం గ్రూపులుగా వచ్చినవారికి వాహనాలు అందించాలని తెలిపారు. దళిత బంధు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Share This Post