దళిత బంధు – మా జీవితాలలో వెలుగు. సంతోషం వ్యక్తం చేసిన వాసాలమర్రి లబ్దిదారులు.

దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధి కొరకు గౌ,,ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వారి జీవితాలలో వెలుగులు నింపిందని వాసాలమర్రి ప్రజలు సంతోషం వ్యక్తం చేసినారు.
దళిత బంధు పథకమును పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాగం దళిత బంధు పథకమును ప్రవేశపెట్టిన వెంటనే చర్యలు చేపట్టి , మొట్టమొదటగా లబ్దిదారులకు అనేక విషయాలలో అవగాహన తరగతులు నిర్వహించింది. గ్రామస్థాయి కమిటీని నిగమించింది. అదే విధముగా జిల్లా స్థాయి అధికారులతో కూడా కమిటీలను ఏర్పాటు చేసి దళితబంధు నిధులను సద్వినియోగం చేయుటకు అనేక విషయముల పై లబ్దిదారులకు దాదాపుగా 2 మాసముల కాలములో అనేక మార్లు సమావేశములు నిర్వహించి ఏయే పథకములను ఏర్పాటు చేస్తే లాబాదయకాముగా ఉంటుందో అనే అంశముల పై అవగాహనను కల్పించినారు.
అందులో బాగముగా, పాడి పరిశ్రమను నిర్వహించుటకు అందులోని మెళకువలను నేర్పి చుటకు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలోనికి  తీసుకొని వెళ్లి యాదగిరిగుట్ట మండలంలోని ధర్మారెడ్డి గూడెంలో మరియు భువనవిరి మండలంలోని రాయగిరి గ్రామములో నిర్వహిస్తున్న  పాడి పరిశ్రమ (పాడి గేదెలు, ఆవులు) ,కూనూరు , చిన్నకందుకూరు గ్రామములోని  కోళ్ళ పరిశ్రమకు తీసుకొని వెళ్ళి జిల్లా పశు సంవర్ధక అధికారి ,పశు. వైద్యాధికారులతో ఆ యూనిట్ల పై అవగాహనను కల్పించినారు.
అదే విధముగా ఉద్యాన శాఖ అధికారులతో తుర్కపల్లి మండలంలోని పల్లెపహడ్ , బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి , బీబీ నగర్ మండలంలోని మగ్దు0పల్లి , భువనగిరి మండలములోని అనాజిపూర్, బొల్లెపల్లి గ్రామాములో రైతులు నిర్వహిస్తున్న పండ్లు, పూలు,కూరగాయల, మల్బరీ, డ్రాగన్ ఫ్రూట్ తోటలందు మరియు పాలీహౌజ్ ద్వారా నిర్వహించే తోటలకు తీసుకొని వెళ్ళి ఆ తోట సాగులోని మెళకువలను మరియు అవగాహనను కల్పించినారు.
వాటితో పాటుగా , గ్రామములోని రైతు వేదిక యందు NECC అడ్వైజర్ మరియు రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ పశు సంవర్ధక శాఖ గారి ద్వారా పాడి పరిశ్రమ , కోళ్ళ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందు విషయములో అవగాహనను కల్పించినారు. సూక్ష్మ, లఘు పరిశ్రమల ఏర్పాటు చేయుటకు , పరిశ్రమల శాఖ అధికారులతో , జాతీయ MSME శాఖ సహాయ సంచాలకులు గారితో అవగాహనను కల్పించినారు. పలు యూనివర్సిటీల ప్రొఫెసర్ల బృందం తో దళితబంధు నిధులు సద్వినియోగం చేసుకొనుటకు సూచనలు ఇప్పించారు . జిల్లా ఉపాధికల్పనాధికారి సహకారంతో గ్రామాములో జాబ్ మేళాను నిర్వహించి (20) చదువుకున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వేతర కంపెనీలలో ఉద్యోగములు కల్పించినారు.
అవగాహన  మరియు క్షేత్ర పర్యటన కక్త్ర్యక్రమములు నిర్వహించిన తదుపరి , చివరగా వివిధ రంగాల పథకముల ఏర్పాటుకు జిల్లా మరియు మండల స్థాయి అధికారులతో రిసోర్స్ టీంలను ఏర్పాటు చేసి లబ్దిదారులకు ఆసక్తి ఉన్న రంగాల పైన అవగాహనతో పాటుగా వారి సలహాలతో , సూచనలతో లబ్దిదారులు ఎంచుకున్న పథకములలో ప్రాజెక్ట్ నివేదికలను తయారు చేసినారు.
లబ్దిదారులకు ఆసక్తి ఉన్న రంగాలలో పథకములలో అవగాహన , శిక్షణా కార్యక్రమముల పూర్తి అయిన తదుపరి లబ్దిదారులే స్వయముగా వారికి ఆసక్తి యున్న యూనిట్లను నెలకొల్పుటకు వివిధ కంపెనీలను సందర్శించి కొటేషన్లను తీసుకున్నారు. అట్టి కొటేషన్లను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన రిసోర్స్ టీం సంబంధిత అధికారులు కొటేషన్లను పరిశీలించి సంబంధిత కంపెనీలను సందర్శించి యూనిట్ల నాణ్యతను పరిశీలించి ధరలను కొంతమేర తగ్గించి యూనిట్లను పంపిణీ చేసినారు.
అందులో బాగముగా మొదటి విడతగా జిల్లా మంత్రివర్యులు శ్రీ జి. జగదీశ్వర్రెడ్డి గారు, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీత రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధుల  ఆధ్వర్యములో రవాణా వాహనములను అనగా గూడ్స్ రవాణా, ట్రాక్టర్ డోజర్ లు, ఆటోలు పంపిణీ చేసినారు. వాహనములను అందుకున్న లబ్దిదారులు డ్రైవర్లుగా పని చేస్తూ, వాహన యజమానులుగా మారినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయుచున్నారు.
ఆ తదుపరి, భవన నిర్మాణ రంగంలో మేస్త్రీలుగా, కూలీలుగా పని చేయుచున్న లబ్దిదారులు, వారి కోరిక మేరకు (6) కుటుంబములకు సెంట్రింగ్ మెటీరియల్, పిల్లర్ల బాక్సులు, జాకీలతో పథకములు పంపిణీ చేసినారు. మెడికల్ ల్యాబ్ నందు విద్యానభ్యసించిన కుటుంబసభ్యులు ఉన్నందున (1) యూనిట్ ను .మండలంలోని మాదాపూర్ గ్రామములోని ప్రయివేట్ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొంద పరచుచున్నామని లబ్దిదారుడు సంతోషాన్ని వ్యక్తం చేసినారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయుటకు ప్లాస్టిక్ వాడకముల నివారించుటకు (2) పేపర్ ప్లేట్ల మరియు పేపర్ గ్లాసుల తయారీ యూనిట్లను గ్రామములో ఏర్పాటు చేయుటకు మిషన్లు కొనుగోలు చేసినారు. 3,4 రోజులలో వాటి తయారీ మదలైతున్నందున, లబ్ధిదారులు పరిశ్రమల యజమానులుగా మారుతున్నందుకు వారి సంతోషానికి అవధులు లేవు. వెల్డింగ్ కోర్సునందు విద్యనభ్యసించిన లబ్దిదారుడు, వెల్డింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయుచున్నారు. మరల (2) పత్తితో వత్తులు చేయు మిషన్ లను పంపిణీ చేయుటకు సిద్ధం చేసినారు. వాటితో పాటుగా కోళ్ళ పరిశ్రమలో పనిచేసిన లబ్దిదారులు , (11) మంది కోళ్ళ షెడ్ లను నిర్మించుటకు ఆసక్తి కనబర్చినారు. వారు,  వారి వ్యవసాయ క్షేత్రములో షెడ్ ల నిర్మాణము చేపట్టుచున్నారు. సమీకృత విధానములో పరిశ్రమను ఏర్పాటు చేయుటకు స్నేహ కంపెనీ ద్వారా కోడిపిల్లల సరఫరా చేయుటకు మరియు కోళ్లను కొనుగోలు చేయుటకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చు కొనినారు.
వ్యవసాయ భూములను కల్గిన లబ్దిదారులు, (12) కుటుంబాలు బోర్లను వేసుకున్నారు.అందులో కూరగాయల తోటలను , కోళ్ళ పరిశ్రమను ఏర్పాటు చేయుటకు ఆసక్తి ఉన్నందున వాటిని ఏర్పాటు చేయుటకు తగు చర్యలు చేపట్టినారు.
(11) కుటుంబాలు పాడి పరిశ్రమను , (7) కుటుంబాలు గొర్ల పెంపకమును చేసుకొనుటకు సంసిద్ధత తెలిగజేసినారు. ఆ ప్రకారము వారికి వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేయుటకు అధికారులు తగు చర్యలు చేపట్టినారని తెలియజేసినారు.
భువనగిరి పట్టణములో బత్తుల ఉపేంద్ర స్థాపించిన franchise agency (సబ్ డీలర్ షిప్) యూనిట్ ను  జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఆకస్మిక తనిఖీ చేసినారు. వారి యూనిట్ నందు వారితో పాటుగా ఇతర (4) కుటుంబములకు పని కల్పించినందుకు సంతృప్తిని వ్యక్త పరిచినారు. దళితబంధు లబ్దిదారుడు ఇతరులకు పని కల్పించే స్థాయికి ఎదిగినారని , సంతోషాన్ని వ్యక్తం చేసినారు. యస్.సి కార్పొరేషన్ అధికారులు హాజరైనారు.
దళితబంధు పథకం ద్వారా ఆర్ధిక సహాయము అందించిన గౌరవ ముఖ్యమంత్రికి ఋణపడి ఉంటామని, ఎన్ని జన్మలకైనా వారి ఋణం తీర్చుకోలేమని లబ్దిదారులు వాగ్దానం చేసినారు. మేము ఆర్ధికంగా బలపడుతామని , సంతోషాన్ని వ్యక్తం చేసినారు.
దళిత బంధు – మా జీవితాలలో వెలుగు.
సంతోషం వ్యక్తం చేసిన వాసాలమర్రి లబ్దిదారులు.

Share This Post