దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ కమిటీ అధికారులతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

పత్రికా ప్రకటన తేదీ: 28-1-2022
కరీంనగర్

దళిత బంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలి

పాడి పరిశ్రమ యూనిట్లకు అధిక ప్రాధాన్యము

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000

హుజూరాబాద్ నియోజకవర్గం లో లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని, పాడి పరిశ్రమ యూనిట్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ కమిటీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గం లబ్ధిదారులకు దళిత బందు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పాడి పరిశ్రమ యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చి లబ్ధిదారులకు శిక్షణ ఇప్పించాలని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న పాడిపరిశ్రమ యూనిట్లకు గ్రామాల వారిగా పాడి గేదెల కొనుగోలుకు కరీంనగర్ డైరీ, విజయ డైరీ ప్రతినిధులు లబ్ధిదారులను ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాలకు తీసుకువెళ్లి పాడి గేదెలను కొనుగోలు చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారు లు ఎంపిక చేసుకున్న ఇతర లాభసాటి యూనిట్లను సెంట్రింగ్ , ఫర్టిలైజర్, మెడికల్ షాప్, మినీ సూపర్ మార్కెట్ ల కు సంబంధించి ఎస్ బి ఐ ఆర్ సేతి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సమగ్ర శిక్షణ ఇప్పించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు. మంజూరైన యూనిట్లను లబ్ధిదారులు సొంతంగా నిర్వహించుకోవాలని ఇతరులకు అమ్ముకున్న చొ యూనిట్లు రద్దు చేస్తామని తెలిపారు. ఇదివరకే లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేసిన జెసిబి, హార్వెస్టర్ లు, డీసీఎం వాహనాలకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని మోటార్ వెహికల్ అధికారిని ఆదేశించారు. దళిత బందు యూనిట్లు గ్రౌండింగ్ చేసే సమయంలో లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దని, యూనిట్లు మంజూరు చేస్తామని ఎవరైనా లబ్ధిదారులను డబ్బులు డిమాండ్ చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో గ్రౌండింగ్ కమిటీ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ డిడి శ్రీనివాస్ , ఆత్మ పీడీ ప్రియదర్శిని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, హుజురాబాద్ ఎం వి ఐ సిరాజ్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్, కరీంనగర్ డైరీ, విజయ డైరీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌరసంబంధాల అధికారి కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ కమిటీ అధికారులతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

 

Share This Post