దళిత బంధు యూనిట్ లు గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

దళిత బంధు యూనిట్ లు గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -06:

దళిత బంధు యూనిట్ లు గ్రౌండింగ్ పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె.శశాంక ములుగు నియోజకవర్గం దళిత బంధు యూనిట్ ల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ములుగు నియోజకవర్గం లోని గంగారం, కొత్తగూడ లో లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ లపై సమీక్షించారు. సీడ్స్, ఫర్టిలైజర్స్ యూనిట్ ఏర్పాటు చేయుటకు అర్హత ఉన్న వారికి అవకాశం కల్పించాలని తెలిపారు. రవాణా సంబంధిత, ఇతర యూనిట్ లపై యూనిట్ ల వారీగా సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో ఈ.డి. ఎస్సీ కార్పొరేషన్ బాలరాజు, దళిత బంధు ములుగు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు బుచ్చిబాబు, తహశీల్దార్లు రాఘవ రెడ్డి, ఎం.పి.డి. ఓ. గంగారం వెంకటేశ్వర్లు, కొత్తగూడ భారతి లు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post