దళిత బంధు యూనిట్ లు గ్రౌండింగ్ కు చర్యలు తీసుకొని పూర్తి చేయాలి..

దళిత బంధు యూనిట్ లు గ్రౌండింగ్ కు చర్యలు తీసుకొని పూర్తి చేయాలి..

ప్రచురణార్థం

దళిత బంధు యూనిట్ లు గ్రౌండింగ్ కు చర్యలు తీసుకొని పూర్తి చేయాలి….

మహబూబాబాద్, ఏప్రిల్ – 23:

దళిత బంధు యూనిట్ లు గ్రౌండింగ్ పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

శనివారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో దళిత బంధులో గ్రౌండింగ్ చేయవలసిన యూనిట్ లపై జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో సమీక్షించారు.

గ్రౌండింగ్ చేయవలసిన యూనిట్ లను ముందుగా సోమవారం లోగా మంజూరు చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకొని గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని, డైరీ, పౌల్ట్రీ యూనిట్ ఏర్పాటు చేయుటకు షెడ్ ఏర్పాటు చేయించాలని తెలిపారు. రవాణా సంబంధిత యూనిట్ ల విషయమై లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే మంజూరు చేయాలని తెలిపారు. ఇంకను మంజూరు చేయవలసిన యూనిట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మెడికల్ షాప్, టెంట్ హౌజ్, సెంట్రింగ్, మినీ సూపర్ మార్కెట్, బ్రిక్స్ తయారీ పరిశ్రమ, తదితర యూనిట్ ఏర్పాటుకు రిసోర్స్ పర్సన్స్ చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ.డి.ఎస్సీ కార్పొరేషన్ బాలరాజు, డిప్యూటీ సి.ఈ. ఓ., డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ టి. సుధాకర్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, రిసోర్స్ పర్సన్స్, నియోజక, మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, దళిత బంధు గ్రౌండింగ్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post