*దళిత బంధు లబ్దిదారులను*
*సంపద, ఉద్యోగాల సృష్టికర్తలుగా* *తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్*
——————————
ఎస్సీ లు ఆకాశమే హద్దుగా ఎదగాలి అనే ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా దళిత బంధు లబ్దిదారులను
సంపద, ఉద్యోగాల సృష్టికర్తలుగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
శనివారం IDOC లోని తన ఛాంబర్ లో దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ (డిక్కీ) అధ్యక్షురాలు శ్రీమతి అరుణ నేతృత్వంలోని ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
దళిత సమాజం కూడా అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్న సంకల్పంతో
దళితుల అభ్యున్నతి కోసం డిక్కీ సంస్థ చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లాలో మొదటి విడతలో 205 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం ను వర్తింప జేసామనని కలెక్టర్ డిక్కీ ప్రతినిధుల కు తెలిపారు.
లబ్ధిదారులు వారి ఛాయిస్ కు అనుగుణంగా స్వయం ఉపాధి యూనిట్ లను ఎంపిక చేసుకున్నారని తెలిపారు.
దళిత బంధు పథకం క్రింద మంజూరు చేసిన ప్రతి యూనిట్ విలువ పెంచేలా, యూనిట్ నిర్వహణ సుస్థిరం అయ్యేలా వారికి మెకువలు తెలియజేస్తూ.. మార్గదర్శనం చేయాలన్నారు. ప్రత్యేక శిక్షణ కూడ ఇచ్చి పథకం ఉద్దేశ్యం నెరవేరేలా ఎస్సీలకు సంపద సృష్టి కర్త లుగా, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలాసహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డిక్కీ ప్రతినిధుల ను కోరారు.
అనంతరం IDOC లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో దళిత బంధు పథకం లబ్ధిదారులను ఎలా సక్సెస్ పుల్ పారిశ్రామిక వేత్తలు గా తీర్చిదిద్దవచ్చో తెలుపుతూ… డిక్కీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ed వినొద్ లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఆవెంటనే డిక్కీ ప్రతినిధులు సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని డ్రై రిసోర్స్ పార్క్ ను సందర్శించారు.
——————————