దళిత బంధు లబ్దిదారుల గ్రౌoడింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి

దళిత బంధు లబ్దిదారుల గ్రౌoడింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ*

*మే 23,*

  1. *దళిత బంధు లబ్దిదారుల గ్రౌoడింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి

*జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సోమవారం కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో దళిత బంధు పథకం యూనిట్స్ అమలుపై దళిత బంధు మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గ్రౌoడింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సంబంధిత శాఖల సిబ్బందిని ఆదేశించారు. లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ .10 లక్షల రూపాయల విలువగల యూనిట్స్ లేదా ఉమ్మడి వ్యాపార యూనిట్స్, వివిధ రకాల వ్యాపారాలు ఎంచుకొని లాభం వచ్చే విధంగా ఉండాలని అన్నారు.

ఎలాంటి సమాచారం సందేహాలు ఉన్న దళిత బంధు సెక్టోరియల్ అధికారుల నుండి సమాచారం తీసుకోవాలని అన్నారు.

యునిట్స్ త్వరగా వచ్చే విధంగా సంబంధిత కంపెనీల మాట్లాడి ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్,ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవి లత, దళిత బంధు ప్రత్యేక అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది డా. వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.          ok

Share This Post