దళిత బంధు లబ్ధిదారులకు 47 యూనిట్ల పై అవగాహన అవసరం

దళిత బంధు లబ్ధిదారులకు 47 యూనిట్ల పై అవగాహన అవసరం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ములుగు నియోజకవర్గం లో ఎక్కువ మంది దళితులకు ఇవ్వాలని దళిత బంధు పథకం విస్తృత పరచాలని స్థానిక శాసన సభ్యురాలు ధనసరి అనసూయ అన్నారు.

జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ములుగు వారి ఆధ్వర్యంలో ములుగు, భద్రాచలం నియోజకవర్గ దళిత బందు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి అధ్యక్షత వహించగా స్థానిక శాసన సభ్యురాలు ధనసరి అనసూయ భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వై వి గణేష్, ఆర్ డి ఓ రమాదేవి హాజరై మాట్లాడారు.

ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ములుగు నియోజకవర్గంలో 9 మండలాలో దళిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ మందికి దళిత బంధు వర్తించేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు.

దళిత బంధు లబ్ధిదారులు ప్రతి యూనిట్ పై కచ్చితమైన అవగాహన కలిగి ఉండి ఆదాయం పొందే విధంగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

భూమి నుండి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున ట్రాక్టర్ హార్వెస్టర్ సమిష్టిగా కొనుగోలు చేసి లబ్ధిదారులు నష్టపోకుండా మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆర్థికంగా ఎదిగే విధంగా దళిత బంధు పథకాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు ధన సరి అనసూయ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్థికంగా వెనుకబడి వాళ్లకు ఆర్థిక భరోసా ఉద్యోగ ఉపాధి పథకాలు మరెన్నో తీసుకురావాలని ఆమె కోరారు.

భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య మాట్లాడుతూ దళిత బంధు పథకం మంచి పథకం అని లబ్ధిదారులకు అధికారులు మంచి అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించాలని అందుకు తగిన అవగాహన కల్పించి లబ్ధిదారులు ఈ పథకాన్ని ఉపయోగించుకునేలా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందుకు ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మా నియోజకవర్గంలో 40 మందిని ఎంపిక చేసినందుకు తాసిల్దార్ లను ఎంపీడీవో లకు అభినందనలు తెలిపారు.

దళిత బంధు అవగాహన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు శాఖల వారీగా లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.

పాడి పశువుల పెంపకం బాయిలర్ కోళ్ల పెంపకం పొట్టేళ్ల పెంపకం వీటికి సంబంధించి జిల్లా వెటర్నరీ అధికారి విజయ భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లబ్ధిదారులకు లాభదాయకంగా ఉండే విషయాలను వివరించారు.

వాహనాల కొనుగోలు ట్రాక్టర్ హార్వెస్టర్ లైసెన్స్ వాటి ద్వారా వచ్చే ఆదాయం సంబంధించిన విషయాలను ఆర్టీవో వేణు లబ్ధిదారులకు లైసెన్స్ పొందే విధానం వివరించారు.

జల్లా వ్యవసాయ శాఖ సంచాలకులు శ్రీపాల్ లబ్ధిదారులకు ఫర్టిలైజర్స్ షాపులు డ్రోన్ డ్రిప్స్ వాటికి సంబంధించి వచ్చే ఆదాయం గురించి వారు అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో కె రమాదేవి మాట్లాడుతూ జిల్లాలో దళిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని దళిత బంధు పథకం లబ్ధిదారులు సద్వినియోగ పరచుకొని లాభసాటిగా ఉండే విధంగా వారి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దళిత బందు పథకం లబ్ధిదారుల ఎంపిక మండలాల తహశీల్దార్లు ఎంపిడివోలు పారదర్శకంగా ఎంపిక చేశారని ఈ సందర్భంగా వారు అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి లబ్ధిదారులకు నగదు చేతికి ఇవ్వరని టెక్నాలజీ పరంగా అ వారు ఎంపిక చేసుకున్న యూనిట్ సంబంధించి వారి ఖాతాలో 9 లక్షల 90 వేలు జమ చేస్తారని ఎంపిక చేసుకున్న యూనిట్ సంబంధించి డబ్బులు చెల్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపడతామని వారు పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల వారికి నచ్చిన స్కీములు ఎంపిక చేసుకునే విధంగా వివిధ శాఖల నుండి అధికారులకు అవగాహన కార్యక్రమం చేపట్టామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 119 మంది ని లబ్ధిదారులుగా ఎంపిక చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది రెవిన్యూ సిబ్బంది ఆయా మండలాల తహశీల్దార్లు ఎంపిడివోలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post