దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి: రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ , రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

దళిత బంధు దేశానికే ఆదర్శం – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

 

ప్రతి నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే – మంత్రి కొప్పుల ఈశ్వర్

 

ఫిబ్రవరి 5 లోగా లబ్ధిదారుల ఎంపిక ఎంపిక పూర్తి చేయాలి

 

మార్చ్ 7వ తేదీలోగా 100% గ్రౌండింగ్ జరగాలి

 

దళితబంధు కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలవనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

జిల్లాల కలెక్టర్లతో శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు దళిత బంధు నిర్వహణ లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ…..

ఈ పథకం తెలంగాణాలోని దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేసేందుకే గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాన్ని రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టారనన్నారు.

జిల్లాల కలెక్టర్లు అంతే బాధ్యతాయుతంగా పనిచేసి 100% పథకం విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు.

ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపికను ఫిబ్రవరి 5వ తేదీలోగా పూర్తిచేయాలని ఫిబ్రవరి 10వ తేదీ లోగా ప్రత్యేక బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

మార్చి 7వ తేదీలోగా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు వేసి 100% గ్రౌండింగ్ పూర్తి కావాలనన్నారు.

జిల్లాల కలెక్టర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్ జిల్లాస్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించాలన్నారు.

కరీంనగర్ నుండి పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ….

ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రతి జిల్లా కలెక్టర్ అధికారులు దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసేలా కృషి చేయాలని మంత్రి సూచించారు.

ప్రతి నియోజకవర్గానికి వందమంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేకు అప్పగించడం జరిగిందని, ఫిబ్రవరి 5వ తేదీ లోగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి జిల్లా ఇన్చార్జి మంత్రులతో ఆమోదం పొందాలని సూచించారు.

అదేవిధంగా ఫిబ్రవరి 10వ తేదీ లోగా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనన్నారు.

దళితబంధును డబ్బులను ఆదాయం పెంపొందించే ఉపాధి, వ్యాపార మార్గాలపై వెచ్చించేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.  ఇతర పథకాలను అమలు చేసిన స్ఫూర్తితో దళిత బంధును సైతం విజయవంతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పథకానికి కావలసిన నిధులకు కొరత లేదని మంత్రి తెలిపారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ ….

నారాయణపేట, మక్తల్ మరియు కోడంగల్ నియోజకవర్గం లోని కోస్గి, మద్దూర్ మండల  ఉన్నాయని,  ప్రతి నియోజక వర్గం లో 100 మంది లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెల 5వ తేదీలోగా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా 100% గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు.

జిల్లా నుండి అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, యస్సీ ed హరినాథ్ రెడ్డి, కన్య కుమారి, DRDo గోపాల్ నాయక్, సిఇఓ సిద్రమప్ప, డిపిఓ మురళి, సిపిఓ గోవిందా రాజన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post