దళిత యువకుడు నాగరాజు హత్యకు కారకులైన హంతకులను ఎస్సి యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షిస్తామని జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా…

దళిత యువకుడు నాగరాజు హత్యకు కారకులైన హంతకులను ఎస్సి యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షిస్తామని జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా అన్నారు.

శనివారం రోజున వికారాబాద్ జిల్లా, మార్పల్లి మండలానికి చెందిన నాగరాజు మతాంతర ప్రేమ వివాహం చేసుకొని ఈనెల 4న హైదరాబాద్ లో హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయినందున, ఆ కుటుంబం ఆర్థికంగా నీలదొక్కు కొనేందుకు ఎస్సి యాక్ట్ ప్రకారం కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మూడు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు రూ. 8.25 లక్షల ఆర్థిక సహాయాన్ని రెండు విడతలలో అందించేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ మరియు అధికారులకు సూచించడం జరిగిందని చైర్మన్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా నేరస్తులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇందుకోసం హైదరాబాద్ లో చీఫ్ సెక్రటరీ మరియు డిజిపి లతో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసినట్లు, మరో ముగ్గురు ఫారరీలో ఉన్నట్లు తెలిపారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నిఖిల బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిలతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, ఎస్సి కార్పొరేషన్ ఇడి బాబూమోజెస్, జాతీయ ఎస్సి కమిషన్ మాజీ సభ్యులు రాములు తదితరులు పాల్గొన్నారు.

Share This Post