దళిత సాధికారతకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో అమలు చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 27 ఖమ్మం:

దళిత సాధికారతకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో అమలు చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ.పి.జి.వి.బి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి.సి.సి. బి బ్యాంకుల ఉన్నత స్థాయి అధికారులతో ఏర్పాటు. చేసిన సన్నాహక సమావేశంలో దళితబంధు అమలు విధి విధానాలను జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న దళితులను యజమానులుగా చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధుకు శ్రీకారం చుట్టిందని, త్వరలోనే చింతకాని మండలంలో దళితబంధును అమలు చేయనున్నామని, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయాన్ని ఎటువంటి సబ్సిడీ లేకుండా నేరుగా ప్రభుత్వం అందిస్తుందని, దీనికిగాను ఆయా బ్యాంక్, బ్రాంచ్ లబ్ధిదారుల కొరకు ప్రత్యేకంగా ఖాతాలను ప్రారంభించేందుకు బ్యాంకర్లు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఇట్టి ఖాతాకు జమకాబడే సొమ్ము నుండి ఎటువంటి విజనహాయింపులు చేయడానికి వీలులేదని దళితబంధు పథకం ద్వారా ప్రతి కుటుంబానికి అందించే 10 లక్షలతో లబ్ధిదారుని అభీష్టం మేరకు రాష్ట్రంలో ఎక్కడైనా, ఏదైనా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ కల్పించబడిందని, వ్యాపారం లేదా యూనిట్ స్థాపనకు అవసరమైన మొత్తాన్ని దశలవారీగాడ్రా చేసుకునే సౌలభ్యం కల్పించబడిందని లబ్ధిదారులు ఒకే సారి 10 లక్షలు డ్రా చేసుకోకుండా యూనిట్ల స్థాపన ఆధారంగా సొమ్ము డ్రా చేసుకోవచ్చని, ఏదైనా వ్యాపారం లేదా యూనిట్లకు సంబంధించిన చెల్లింపుకై జిల్లా కలెక్టర్ ప్రోసీడింగ్ ద్వారా థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందని 10 లక్షలు ఆర్ధిక లావాదేవీల పూర్తి సమాచారం. జిల్లా కలెక్టర్ డ్యాష్ బోర్డులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. చింతకాని మండలంలో త్వరలోనే సర్వే ప్రారంభమవుతుందని, సర్వే బృందంతో పాటు బ్యాంక్ సిబ్బంది లబ్ధిదారుల సమగ్ర సమాచారాన్ని సేకరించవచ్చని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో అమలు చేస్తున్న దళితబంధు. పథకాన్ని రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో అమలుపై దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నాయని, దళితబంధును మన జిల్లాలో విజయవంతంగా అమలుకై బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు.

ఆయా బ్యాంకుల ఉన్నత అధికారులు, లబ్దిదారుల ఖాతాలను ప్రారంభించే ప్రక్రియపై ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్రస్థాయి అధికారుల సూచనల మేరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ వి.బి.నారాయణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ పార్ధసారధి, ఏ.పి.జి.వి.బి రీజినల్ మేనేజర్ రమేష్, డి.సి.సి.టి సి.ఇ.ఓ వీరబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post