దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 9వ తేదీన సంక్షేమ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బి.సి. సంక్షేమ, సివిల్ సప్లై శాఖ మంత్రి – గంగుల కమలాకర్

పత్రిక ప్రకటన
తేది 7-6-2023
నాగర్ కర్నూలు జిల్లా
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 9వ తేదీన సంక్షేమ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బి.సి. సంక్షేమ, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ దినోత్సవం రోజున కులవృత్తుల వారికి ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది చొప్పున లక్ష రుపాలయ చెక్కులను అందజేసేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. కులవృత్తుల ను ప్రోత్సహించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష రుపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారన్నారు. అందువల్ల సంక్షేమ దినోత్సవం రోజున ఎట్టిపరిస్థితుల్లోనూ లక్ష రూపాయల పతాకాన్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించుకోవాలని తెలిపారు.
అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తెప్పించుకొని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకోవాలన్నారు. కల్యాణలక్ష్మి మినహాయించి ఇప్పటివరకు 50 వేలకు మించి ప్రభుత్వ లబ్ది పొందిన వారిని కాకుండా ఇప్పటి వరకు లబ్దిపొందని పేదలకు ఈ పథకానికి ఎంపిక చేయాలని సూచించారు. అదేరోజున రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రార్రంభించి ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు యూనిట్ల పంపిణీ జరిగేటట్లు చూడాలని ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ జూన్ 14వ తేదీన తెలంగాణ వద్యారోగ్య దినోత్సవ వేడుకలను సైతం ఘనంగా నిర్వహించాలని అందుకు పకడ్బందీగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందిని గుర్తించి ప్రశంసా పత్రాలు, మెమొంటో లు ఇవ్వడం, ఆశ, ఎ. ఎన్.యం లకు చీరలు పంపిణీ చేయాలన్నారు. ఇంతకు ముందు పైలెట్ ప్రాజెక్ట్ కింద కే.సి.ఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ జరగని 24 జిల్లాల్లో ఆ రోజు పంపిణీ చేయాలనీ సూచించారు.
కొత్త బి.పి కోట్ల పంపిణీ సైతం చేయాలని సూచించారు. నియోజకవర్గస్థాయిలో 1000 మందికి తగ్గకుండా వేడుకలు నిర్వహించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వము ఇచ్చిన సూచనలు పాటించడం జరుగుతుందని తెలిపారు. జూన్ 9వ తేదీన కుల వృత్తుల వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడతామని అందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. 14వ తేదీన వైద్య ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్ మోతిలాల్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్ జి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————–
జిల్లా పౌర సంబంధాల అధికారి నాగర్ కర్నూలు ద్వారా జారీ.

Share This Post