దశాబ్ది ఉత్సవాల పై సమీక్ష.. ఏర్పాట్లు ఎటువంటి లోపం ఉండకూడదని కమిషనర్ ఆదేశం..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై  మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి బుధవారం  స్థానిక మున్సిపల్ మందిరంలో మున్సిపల్ అధికారులతో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి.రమణాచారి సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో  జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఏర్పాట్లు ఎటువంటి లోపు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలోని ప్రతి జంక్షన్లో విద్యుత్తులైట్లతో అలంకరించాలని ఆదేశించారు  ప్రతి రహదారిలో ప్రతి ఆఫీసుల దగ్గర పారిశుభ పనులు చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జరిగే దగ్గర వాటర్ సప్లై ఏర్పాటు చేయమని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి నాడు నేడు దిశగా ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు  అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, ఈఈ  రాములు,  మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల పై సమీక్ష..
ఏర్పాట్లు ఎటువంటి లోపం ఉండకూడదని కమిషనర్ ఆదేశం..

Share This Post