ప్రచురణార్థం
మహబూబాబాద్ మే 31.
దశాబ్ది వేడుకల నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
బుధవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణ పై మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 21 రోజులపాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల వేడుకలను ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా చేపట్టాలన్నారు ప్రతి కార్యక్రమంలోనూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు రైతుల సహకారం తీసుకోవాలని ర్యాలీలతో గ్రామాలలో పండగ వాతావరణం కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు మండల స్థాయి అధికారులు దశాబ్ది వేడుకలను ప్రతి ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న వేడుకలలో రైతులందరికీ భోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సభలు సమావేశాలతో నాడు నేడు పై సుదీర్ఘ చర్చ జరిపించాలన్నారు ప్రతి ఒక్క అధికారి తమ సొంత ఇంటి కార్యక్రమంగా మనసు పెడితే గాని విజయవంతం అవ్వదని తెలియజేశారు కార్యక్రమాలను వీడియో ఫోటోలు తీయించి పంపించాలన్నారు ప్రతిరోజు జరిగిన కార్యక్రమాలు పై నివేదిక అందించాలన్నారు రాత్రి వేళలో చెరువుల వద్ద జరిగే కార్యక్రమాల పై అధికారులు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు గజ ఈతగాళ్లను సిద్ధం చేసుకోవాలన్నారు మత్స్య కార్మికులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ డేవిడ్ జడ్పిసిఓ రమాదేవి డిఆర్డిఓ సన్యాసయ్య దశాబ్ది ఉత్సవాల నోడల్ అధికారులు సూర్యనారాయణ సుధాకర్ జిల్లా అధికారులు తాసిల్దార్లు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.