దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రదర్శించాలి – దిశాబ్ది ఉత్సవాల రాష్ట్ర నోడల్ ఆఫీసర్, రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్- ఎం. ప్రశాంతి

పత్రికా ప్రకటన

తేదీ 01.06 .2023

దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రదర్శించాలి – దిశాబ్ది ఉత్సవాల రాష్ట్ర నోడల్ ఆఫీసర్, రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ ఎం. ప్రశాంతి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన దిశాబ్ది ఉత్సవాల ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిని, రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ ఎం. ప్రశాంతి గురువారం నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ తో సమావేశమై నాగర్ కర్నూల్ జిల్లాలో దిశాబ్ది ఉత్సవాల నిర్వహణ రోజువారి కార్యక్రమాల ఏర్పాట్లపై ఆమె చర్చించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…..
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సూచించారు.
రాష్ట్రం ఏర్పాటైన తొమ్మిదేళ్లలో నాగర్ కర్నూలు జిల్లాలో ఒక్కో శాఖ సాధించిన విజయాలను తెలియజేస్తూ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు.
గత తొమ్మిదేళ్లలో వాస్తవాలు, గణాంకాలు మరియు విజయాలను వివరించే డాక్యుమెంటరీలను జిల్లా స్థాయిలో ప్రతి శాఖ తయారు చేయాలని ఆమె సూచించారు.
4 మున్సిపాలిటీల్లో అన్ని ముఖ్యమైన పబ్లిక్ స్మారక చిహ్నాలు మరియు భవనాలు 21 రోజులలో లైటింగ్ చేయాలన్నారు.
జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలే కాకుండా నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 21 రోజుల ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని అదనపు ఎస్పీకి ఆదేశించారు.
ఉత్సవాల ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
అన్ని స్థాయిలో నిర్వహించే అన్ని కార్యక్రమాల వివరాలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమె సూచించారు.
రైతు దినోత్సవం, మహిళా దినోత్సవం, సురక్ష దినోత్సవం ఏర్పాట్లపై కలెక్టర్ తో అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో 143 రైతు వేదికలలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
సురక్ష దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన రక్షక్ వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలతో జిల్లాస్థాయిలో జిల్లా కేంద్రంలో భారీగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు సురక్షిత గురించి ప్రజలకు వివరించనున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.
అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్, అదనపు ఎస్పీ రామేశ్వర్, ఆయుష్ జిల్లా అధికారి డాక్టర్ సూర్య నాయక్, డాక్టర్ అరుణ ఈ సమావేశంలో ఉన్నారు.

Share This Post