దసరా ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా ఉండాలి ::నగర మేయర్ గుండు సుధారాణి .

నగరంలో జరిగే దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలనీ అధికారులను నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు .

ఈ నెల 15వ తేదీన దసరా పండుగని పురస్కరించుకొని స్థానిక ఉర్సు గుట్టలో సంబంధిత శాఖ అధికారులతో, ఉత్సవ కమిటీతో, ప్రజా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గోపి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ అన్నీ శాఖల అధికారులు
సమన్వయంగా పని చేసి దసరా ఉత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు .

మైసూర్ తర్వాత ఉర్సు గుట్టలో అంత పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

స్థానిక శాసనసభ్యులు నన్నపునేని నరేందర్
సహకారంతో ఉత్సవాలకు కావలిసిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు.

కార్పొరేషన్ తరపున ఉర్సు గుట్టను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు.

హెరిటేజ్ సిటీగా ప్రాశస్త్యం పొందిన వరంగల్ జిల్లాలో దసరా ఉత్సవాలు కూడా అంతటి పేరు ప్రఖ్యాతలు పొందాలన్నారు.. ఇందుకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు .

ఎంపీ గుండా ప్రకాష్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల గత సంవత్సరం అతి కొద్దీ మందితో దసరా ఉత్సవాల ని
జరుపుకున్నామన్నారు .

ఈసారి కూడ కరోనా నిబంధన లను పాటిస్తూ దసరా ఉత్సవాలను ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా చేసుకోవాలన్నారు

ఉత్సవాలలో గ్రీన్ టపాసులును మాత్రమే ఉపయోగించి
పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు .

ఉర్సు దసరా ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉందని…
ఊహ తెలిసినప్పటి నుండి ఉర్సు ఉత్సవాల కు వస్తున్నా అని ఎంపీ తెలిపారు .

ఉర్సు,రంగశాయి పేట, ఓ సిటీ కమిటీలని విస్తృత పరిచి
ఒకే దగ్గర పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలను నిర్వహించుకుంటే మరింత ప్రాధాన్యం లభిస్తుందన్నారు .

ఉత్సవం కాగానే వదిలేయకుండా ఉర్సు గుట్ట ప్రాంతం
మంచి కార్యక్రమంకి ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలన్నారు.

ప్రజలు తమ తమ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఇక్కడికి వచ్చి గడిపేలా మంచి పర్యాటక ప్రాంతం గా తీర్చిదిద్దాలనారు.

HMDA నుండి యంత్రాలను తెప్పించి చెరువులో
ఉన్న గుర్రెపు డెక్క ను తొలిగించాలన్నారు .

అనంతరం జిల్లా కలెక్టర్ గోపి మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రదేశంగా పేరు గాంచిన వరంగల్ జిల్లాలో ప్రతీ ఉత్సవాన్ని ఘనంగా జరిపేందుకు అన్నీ శాఖల నుండీ తగు ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఉర్సు ఉత్సవాలు అవగానే ఈ ల్యాండ్ కి సంబందించిన అన్నీ రికార్డ్స్ ను పరిశీలించి కోర్టు కేసులు ఉంటే త్వరగా పరిష్కారం అయ్యేలా జిల్లా యంత్రాంగం తరపున తగు చర్యలు తీసుకుంటామన్నారు .

దసరా ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇంచార్జి అధికారులను నియమిస్తామని, ఎక్కడ ఏ సమస్య ఉన్న అక్కడి ఇంచార్జి ఆఫీసర్ కి తెలియ పరచాలన్నారు .

అన్నీ శాఖల అధికారులు సమన్వయం గా పని చేసి ప్రశాంత మైన వాతావరణంలో ప్రజలు పండుగ ను ఆనందం గా జరుపుకునేలా కృషి చేయాలన్నారు .

MLC బస్వారాజ్ సారయ్య మాట్లాడుతూ ఉర్సు గుట్ట అభివృద్ధి కోసం cdp నిధుల నుండి 25 లక్షల ను ఇస్తానని తెలిపారు .

ఈ సమావేశంలో GWMC కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ హరి సింగ్ DCP పుష్ప,RDO మహేందర్ జి, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సంజయ్ బాబు,జనరల్ సెక్రెటరీ బండి కుమార స్వామి,జిల్లా అధికారులు GWMCకి చెందిన వివిధ శాఖల అధికారులు,ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Share This Post