. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఊరు, వాడా చిన్నా పెద్దా తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలు చేసి, బతుకులు చల్లగా చూడమ్మా అంటూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలకు కోలాటాలు, నృత్యాలతో ఎంతో సందడి చేసారని ప్రతి ఒక్కరినీ అభినందించారు. విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ దసరా పండుగ జిల్లా ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులను నింపాలని చెప్పారు. జిల్లాలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని, అభివృద్ధిలో మన జిల్లా ఆదర్శంగా నిలవాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో 6 వ వార్డులో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ సీతా లక్ష్మీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ నుండి ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో దిగ్విజయంగా నిర్వహించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాక ముందు మన సంప్రదాయాలు కనుమరుగయ్యా యని, రాష్ట్ర ఏర్పాటు తదుపరి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించగా ఎంతో వైభవంగా జరుపు కుంటున్నామని చెప్పారు. నిరు పేదలు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకే విదంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా బతుకమ్మ చీరెలు పంపిణీ చేసినట్లు చెప్పారు.