దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో “అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం” కార్యక్రమంలో పాల్గొన్నరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన,  తేది:3.12.2021, వనపర్తి.

జిల్లాలోని దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నదని, ప్రణాళికా బద్దంగా వనపర్తిని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో “అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం” కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. దివ్యాంగులకు ప్రతి మండలంలో ఐదు శాతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని, జిల్లా కేంద్రంలో దివ్యాంగుల భవనం నిర్మాణం కోసం పది గుంటల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి వెల్లడించారు. వనపర్తి అభివృద్ధికి రూ.10.25 కోట్లను సీఎం కేసీఆర్‌ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేశారని, వనపర్తి జిల్లా కేంద్రంలో టౌన్ హాల్ నిర్మాణానికి రూ.5 కోట్లు, నియోజకవర్గంలోని ఏడు మండల కేంద్రాలలో అన్ని వర్గాల సామాజిక భవనాల కోసం ఒక్కొక్క దాని కోసం రూ.75 లక్షల చొప్పున నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. కర్నెతండా లిఫ్ట్ నిర్మాణానికి ఇటీవలే రూ.76.19 కోట్లు మంజూరయ్యాయని, మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయని, వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. వేరుశనగ పరిశోధన కేంద్రం నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని, జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచంలోనే మేధావి అయిన వికలాంగుడు ఎవరు ? అని మంత్రి ప్రశ్నించగా, రఘుపతి రెడ్డి అనే వ్యక్తి “స్టీఫెన్ హాకింగ్”. (Stephen Hawking) అనే బదులు ఇవ్వడంతో మంత్రి బహుమతిగా అతనికి రూ.500/-, మరొక వికలాంగుడికి రూ.500/- మంత్రి చేతుల మీదుగా నగదు రూపంలో బహుమతిగా అందజేశారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు.
జడ్పీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, దివ్యాంగులను చిన్నచూపు చూడరాదని ఆయన తెలిపారు. దివ్యాంగులు వారి సొంత కాళ్లపై వాళ్లు నిలబడేందుకు, ఉపాధి పొందుటకు దివ్యాంగులకు బ్యాంకుల నుండి రుణాలు ఇస్తున్నట్లు ఆయన వివరించారు.
అనంతరం సన్మాన కార్యక్రమం, ఉపాధి పనులలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందించటం, సదరం వైద్య ధ్రువపత్రాలు మంత్రి చేతుల మీదుగా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వా న్, డి డబ్ల్యూ ఓ పుష్పలత, డీఈవో రవీందర్, డిపిఓ సురేష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, డి ఆర్ డి ఎ నర్సింహులు, అడిషనల్ డిఆర్డిఎ కృష్ణయ్య, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ అలివేలమ్మ, నాగ చైతన్య, జడ్పీటీసీలు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post