దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ”మెగా రుణ మేళ” : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన, తేది:22.10.2021, వనపర్తి.

ప్రభుత్వ ఆదేశానుసారం వివిధ బ్యాంకులు స్వయం ఉపాధి కల్పించుటకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు అందించాలని వివిధ బ్యాంకుల అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
శుక్రవారం వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ”మెగా రుణ మేళ” ఋణ విస్తరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని, ఉపాధి పొందుటకు వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని, దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు రుణాలు అందజేసేందుకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తుందని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఋణ విస్తరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏపీ జి వి బి, హెచ్. డి. ఎఫ్. సి, యాక్సిస్ బ్యాంకు, ఐ సి ఐ సి ఐ బ్యాంకుల నుండి రుణాలు పొందేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని బ్యాంకు అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
సూక్ష్మ, మధ్యతరహా రుణాలు(MSME), ముద్ర, స్వానిది, స్టార్ట్ అప్ ఇండియా, అగ్రికల్చర్, పి ఈ ఎం జి పి, పీ ఎం ఎఫ్ ఎమ్ ఈ, తదితర ప్రభుత్వ రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తున్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరిగి రుణాలు అడిగే పరిస్థితి లేదని, వివిధ బ్యాంకులు లబ్ధిదారుల వద్దకే వచ్చి, ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణం అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు. పేద ప్రజలు ప్రైవేటు వారి దగ్గర ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవద్దని, ప్రభుత్వ బ్యాంకులలో రుణాలు పొందితే, లబ్ధిదారులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆమె వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో బ్యాంకుల సహకారంతో పెద్దఎత్తున లబ్ధిదారులకు రుణాలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ సూచించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి (2165) స్వయం సహాయక బృందాలకు రుణాల క్రింద రూ.42 కోట్ల 47 లక్షల విలువగల చెక్కులను, అగ్రికల్చర్ రుణాలు రూ. 3 కోట్లు విలువ కలిగిన చెక్కులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. గత సంవత్సరం రూ.176 కోట్ల రుణాలు, ప్రస్తుత సంవత్సరం రూ.104 కోట్ల రుణాలను అందించి బ్యాంకులు వారి టార్గెట్ ను చేరాయని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వై.సురేష్ కుమార్, ఎస్. బి. ఐ. డి. జీ. యం. కె బంగారు రాజు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం జి.ఎన్. వి.రమణ, యుకో బ్యాంక డి. జీ.యం. శ్రీవాస్తవ, ఎస్బిఐ ఏజీఎం మధు బాబు, ఏపీ. జీ.వి.బి. ఏజీఎం సామ్యూల్, డి ఆర్ డి ఓ. పి.నర్సింలు, పుష్ప లత , యాదమ్మ, జిల్లా అధికార్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post