దాతలను అభినందించిన జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

ప్రచురణార్ధం

దాతలను అభినందించిన కలెక్టర్

మహబూబాబాద్, జూలై,15.

జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు ఆధునిక వైద్య సామాగ్రి అందజేసిన హైదరాబాద్ బురహాని ట్రస్ట్ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్అభినందించారు.

గురువారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దాతలు విచ్చేసి 5లీ. సామర్ధ్యం గల 2ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 250 పి.పి.వి.కిట్స్, 22 మల్టి పారా మోనిటర్ స్టాండ్స్, ఒకటి కార్డియోటోకోగ్రఫీ (గర్భంలోని శిశువు గుండె చప్పుడు లెక్కించే యంత్రం) లను కలెక్టర్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బుర్ర హనీ ట్రస్ట్ ప్రతినిధులు హుస్సేన్ ఇర్ఫాన్ జోహార్ rangoonwala ,జోహార్ ఎజి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు వెంకట రాములు ఆర్.ఎం.ఓ.రమేష్, సివిల్ సర్జన్ పిడియాట్రిక్ నోడల్ ఆఫీసర్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
———————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం. మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post