దాతల ధాతృత్వాలు… సిఎం సహాయ నిధికి చెక్కులు

 


జనగామ/దేవరుప్పుల, ఏప్రిల్ 20ః
కరోనా బాధితులను ఆదుకోవడానికి, వైరస్ నిర్మూలనకు అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు. విరాళాలు ప్రకటిస్తూ తమ ధాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ రోజు పలువురు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుగారికి సిఎం సహాయ నిధికి చెక్కులు అందచేశారు.

జనగామలో ప్రముఖ కాంట్రాక్టర్ శ్రీహరి సిఎం సహాయ నిధికి రూ. 50 వేల చెక్కుని మంత్రి ఎర్రబెల్లికి అందచేశారు. అలాగే దేవరుప్పులలో రిషికా ఎనర్జీ సిస్టమ్స్ ఎంఇ వడ్లకొండ రమేశ్ గౌడ్ రూ.50వేల చెక్కుని మంత్రి ఎర్రబెల్లికి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి సహాయ నిధికి చెక్కులు అందచేసిన వాళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

Share This Post