దాతల సహకారంతో ఐ సి యూ కు సామాగ్రి…

ప్రచురణార్థం

దాతల సహకారంతో ఐ సి యూ కు సామాగ్రి…

మహబూబాబాద్, డిసెంబర్-10:

దాతల సహకారంతో ఐ సి యూ కు సామాగ్రి సమకూర్చినట్లు అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

శుక్రవారం ప్రభుత్వ ఏరియా హాస్పటల్ ను అదనపు కలెక్టర్ సందర్శించి ఐసియు విభాగం పునరుద్ధరణ పనులను ఆస్పత్రి పర్యవేక్షకులు, డాక్టర్స్ తో కలిసి ప్రారంభించారు.

తమకు జన్మనిచ్చిన భూమి రుణం తీర్చుకునేందుకు మహబూబాబాద్ జిల్లా ఇతర ప్రాంతాల కు చెందిన ఎన్నారై దాతలు వెన్నం సిరి, రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి తిరుపతి రెడ్డి ఎర్రం రెడ్డి మేనేజర్ తిరుపతి ఉషా కర్ తదితరులు సుమారు 22 లక్షలతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఐసియు విభాగానికి 10 బెడ్ లతో సీలింగ్ వెంటిలేటర్ పల్స్ ఆక్స్ మీటర్ లు 5 మల్టీ పేరా మానిటర్ సెక్షన్ ఆపరేటర్స్ 5, ఇన్ వ్యూజియన్ పంప్స్2, బల్క్ సిలిండర్ లు 15, ఫ్యామిలీ 8, లైట్స్ వైరింగ్ తో సహా అందజేసినట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు భూక్యా వెంకటరాములు వివరించారు.

అదేవిధంగా మయూర్ నిర్మాణ్ ట్రస్ట్ కింద దాత వెంకీ నారాయణ గారు 21 లక్షలతో గూడూరు 10 పడకల ఐసియు విభాగానికి సరిపోను సామగ్రిని అందించినట్లు పర్యవేక్షకులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్లు రమేష్ వైదేహి నాగేశ్వరావు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post