దానాలలో గొప్ప దానం రక్త దానం :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన..1 తేదిః 30-11-2021

దానాలలో గొప్ప దానం రక్త దానం :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్ 30: అన్ని దానాలలోకి గొప్ప దానం ఈ రక్తదానం అని, రక్తదానం వలన నిత్యజీవితంలొ కేవలం ప్రమాదాలకు గురైన సమయంలో మాత్రమే కాకుండా శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసేమియా వ్యాధిగ్రస్తులతో పాటు ఇతర వైద్య చికిత్స సమయాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జగిత్యాల ఆర్టీసి డిపోలో ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విశిష్ట అతిధిగా పాల్గోన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటి ఆద్వర్యంలో జగిత్యాల, కోరుట్ల మరియు మెట్పల్లి ఆర్టిసి డిపోలకు చెందిన సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలొ పాల్గోని, రక్తదానం చేసే వారికి, కార్యక్రమ నిర్వహకులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర శస్త్రచికిత్సలు మరియు ప్రసవాల సమయంలో రక్తం ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని, రక్తం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన రాష్ట్ర గవర్నర్ మరియు ఆర్టీసీ ఎండి లు రక్తదానం కొరకు జారిచేసిన ఆదేశాల మేరకు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, రక్తదానం చేయడం ద్వారా ఎటువంటి ప్రాణ, ఆరోగ్య నష్టం ఉండదని, రక్తాన్ని దానం ఇవ్వడం ద్వారా అపాయంలో ఉన్నవారిని పరోక్షంగా ఆదుకోగలుగుతారని పేర్కోన్నారు.
మనం నిర్వర్తించే విధులలో ఎంత బాధ్యతగా ఉంటామో, అదే విధంగా మనం పనిచేసే ప్రదేశం కూడా చక్కటి వాతావరణాన్ని అందిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. రెడ్ క్రాస్ సోసైటి వారు కేవలం రక్తదాన కార్యక్రమాలు మాత్రమే కాకుండా, కరోనా కాలంలో అవసరమైన వారికి సరుకులు అందించడం, ఐసోలేషన్ ఎర్పాట్లు చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించినందున వారిని ప్రత్యేకంగా అభినంధించారు.
జిల్లాలో సుమారుగా 85% మొదటి, 42% ప్రజలకు కరోనా వ్యాక్సిన్లను అందించడం జరిగిందని, కరోనా పై ఎవరుకూడా నిర్లక్ష్యం వహించరాదని, మొదటి విడతలో ఎంత జాగ్రత్త వహించామో, ఇప్పడుకూడా అంతే జాగ్రత్తగా మాస్కులు దరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటివి పాటించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 200టీంల ద్వారా గ్రామాలలో, 65 టీంల ద్వారా పట్టణాలలో కోవిడ్ వ్యాక్సిన్ ను అందించడం జరుగుతుందని, కార్యక్రమ నిర్వహణకు వైద్య, పంచాయితిరాజ్ శాఖ, ఇతర శాఖలలోని క్రిందిస్థాయి సిబ్బంది నుండి జిల్లా అధికారుల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయడంలో అహర్నిషలు కృషిచేస్తున్నారని పేర్కోన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటి కార్యదర్శి మంచాల కృష్ణ, జగిత్యాల ఆర్టిసి డివియం నాగేశ్వర్, జగిత్యాల డిపో మెనేజర్ జగదీశ్, కోరుట్ల డిపో మెనేజర్ కృష్ణమోహన్, కమిటీ సభ్యులు సిరిసిల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

దానాలలో గొప్ప దానం రక్త దానం :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post