దాన్యం కొనగోళులో అలస్యం జరగరాదు :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 25-11-2021
దాన్యం కొనగోళులో అలస్యం జరగరాదు :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్ 25:
కోనుగోలు కేంద్రాల వద్ద దాన్యం కోనుగోలులో ఎటువంటి అలస్యం జరగడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం మేడిపల్లి జోగిన్ పల్లి పీఏసిఎస్, పోరుమల్ల, మాదాపూర్ ఐకేపి కోనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా కోనుగోలు కేంద్ర నిర్వహకులు, అధికారులతో మాట్లాడుతూ, వ్యవసాయశాఖ అధికారుల ద్వారా దృవీకరించిన దాన్యాన్ని మాత్రమే కోనుగోలు చేయాలని, ఖచ్చితమైన ఎఫ్ఎక్యూ పరిమాణాలను పాటించాలని, అనంతరం దాన్యం నాణ్యత ప్రమాణాలను ఏ విధంగా పాటిస్తున్నది, లోడింగ్, అన్ లోడింగ్ లో అలస్యం జరగకుండా ఏం చేస్తున్నారన్న విషయాలను అడిగితెలుసుకున్నారు. కోనుగోలు చేసిన దాన్యానికి వెంటనే ట్యాబ్ ఎంట్రి జరగాలని, కొనుగోలు కేంద్రాలకు దాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సజావుగా కొనుగోలు ప్రకీయా పూర్తి చేయాలని, రైతులకు ఇబ్బందులు గురిచేసిన వారు చర్యలకు బాద్యులవుతారని హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాలకు దాన్యాన్ని తీసుకుని వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణంలో మార్పులు అకాల వర్షాబావ పరీస్థితులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోని, దాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు దాన్యాన్ని తీసుకువచ్చే ముందు బాగా ఆరబెట్టాలని, దాన్యంలో ఎటువంటి రాలు, తాళు లేకుండా జాగ్రత్తపడాలని సూచించారు. రైతులకు ఎదైన ఇబ్బంది కలిగినట్లయితే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట కోరుట్ల ఆర్డిఓ టి. వినోద్ కుమార్, పిడి డిఆర్డిఎ ఎస్. వినోద్, ఇతర సంబంధిత అధికారులు పాల్గోన్నారు.

దాన్యం కొనగోళులో అలస్యం జరగరాదు :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post