ప్రచురణార్ధం
దివ్యంగులకు చేయూత అందిస్తాం…
మహబూబాబాద్, డిసెంబర్,3.
విధి సహకరించక పోయినా ఆత్మ విశ్వాసంతో ఉన్నత విద్యనభ్యసిస్తూ ఆత్మ స్థైర్యంతో ముందడుగు వేస్తున్న దివ్యంగులకు చేయూత అందిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.
శుక్రవారం ఐ.ఎం.ఏ.హాలులో జిల్లా మహిళ శిశు సంక్షేమం, దివ్యంగుల సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీ పురస్కరించుకుని ప్రపంచ దివ్యంగుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.
ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కలెక్టర్ సభను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్య అభ్యసించిన దివ్యంగులను కలెక్టర్ శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24,256 మంది దివ్యంగులున్నారని తెలియజేశారు.
శారీరక వైకల్యంతో 15,342 మంది దృష్టి లోపంతో 3541, వినికిడి లోపంతో 1839, బుద్ధి మాంద్యతతో 2291, మానసిక రుగ్మత తో 1092, బహుళ వికలత్వం క్రింద 151 మంది ఉన్నట్లు వివరించారు.
24,256 దివ్యంగులలో అర్హులైన 14,522 దివ్యంగులకు ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి 3,016 రూ.లు చొప్పున 4 కోట్ల 31 లక్షల 52 వేల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సమాజంలో అందరూ సమానమే నన్నారు. ఒక వైపు శరీరం సహకరించక పోయిన మరో వైపు వికలాంగత్వంతో పలు సమస్యలను ఎదుర్కొంటు ఆత్మ ధైర్యంతో ముందడుగు వేస్తు ఉన్నత విద్యలో రాణించడం అభినందించదగిన విషయమని, దివ్యంగులకు తప్పనిసరి గా చేయూత అందిస్తామన్నారు.
రెండు పడక గదుల ఇండ్ల మంజూరులో రిజర్వేషన్ లు పాటిస్తామని, ఆసరా పింఛన్లు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదరం ధ్రువీకరణ పత్రంతో అర్హత సాధించిన వారందరికీ పింఛన్లు మంజూరు చేయిస్తామన్నారు.
ప్రభుత్వ కార్యాల అన్నింటిలోనూ వీల్ చైర్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాటరీ వాహనాల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు.
ట్రై సైకిల్స్ ల్యాప్టాప్లు అదనంగా తేప్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనిన, జిల్లా అధికారులు సి డి పి వో లు దివ్యాంగుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది