దివ్యంగులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలని పి.డి. డి.ఆర్.డి.ఏ. గోపాల్ నాయక్ అన్నారు

దివ్యంగులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలని పి.డి. డి.ఆర్.డి.ఏ. గోపాల్ నాయక్ అన్నారు.  అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం, దివ్యంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పి.డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దివ్యంగులు అధైర్యపడకుండా తమ తెలివితేటలను ఉపయోగిస్తూ  ఆర్థికాభివృద్ధిని సాధించాలని సూచించారు.  ప్రభుత్వం ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చి అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వాటిని అందిపుచ్ఛుకోవాలని పిలుపునిచ్చారు.  చుదువుకునేందులు ఆసక్తి కనబరుస్తూ తమకు అనుకూలమైన విధానములో ఉన్న దివ్యంగ పాఠశాలల్లో చదువుకోవాలని సూచించారు.  తక్కువ చదువుకున్న వారికి, చదువు లేనివారికి ఉపాధిహామిలో 100 రోజుల పని కల్పించడం జరిగిందని, వారి స్థాయికి తగ్గ పనిమాత్రమే చెప్పి వేతనం సైతం అధికంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.  కాబట్టి ఉపాధి హామిలో పనిచేయలనుకునే ప్రతి ఒక్కరి పని కల్పించడం జరుగుతుందన్నారు.  ఈ సంవత్సరం 100 రోజులకు పైన పనిచేసిన దివ్యంగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.  జిల్లాలో 9333 మంది దివ్యంగులకు ప్రతి నెల రూ. 3016/- చొప్పున పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ దివ్యంగులకు ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికిని చాలా మందికి అవగాహన లేక సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు.  జిల్లాలో దివ్యంగులకు ఏ సమస్య వచ్చినా చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 18005728980 ఉందని ఇది 24 గంటలు పనిచేస్తుందన్నారు.  అదేవిధంగా ప్రత్యేక కమిషన్ సైతం ఉందని సంస్థలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.  నైపుణ్య శిక్షణ ఇచ్చి సబ్సిడీ బ్యాంకు రుణాలు కల్పించి ఉపాధి కల్పించడం జరుగుతుందని, దివ్యంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బ్లైండ్ సంఘం అధ్యక్షుడు ఇలియాస్ మాట్లాడుతూ  జిల్లాలో అన్ని సంఘాలను కలిపి ఒకే సంఘం ఏర్పాటు చేయాలని కోరారు.  దివ్యంగుల బ్యాక్లాగ్ వెకేన్సిలను గుర్తించి భర్తీ చేయాలని కోరారు.  దివ్యంగులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు.

దివ్యంగుల సేవా సంఘం అధ్యక్షుడు బి. నాగేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్ని సమస్యలు చెప్పిన ప్రభుత్వం నుండి పరిష్కారం కావడం లేదని అన్నారు.  దివ్యంగులకు బడ్జెట్ లో  కేటాయింపులు పెంచాలని, బ్యాంకు రుణాలు ఉదారంగా ఇవ్వాలని అన్నారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, సంక్షేమ హాస్టళ్లలో దివ్యంగులకు నేరుగా ప్రవేశాలు కల్పించాలన్నారు.  శరతులు లేకుండా ఆసరా పింఛన్ మంజూరు చేయాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్ 4 శాతం నుండి 7 శాతానికి పెంచాలని, అదేవిధంగా దివ్యంగ బంధు రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు.

జిల్లా అధ్యక్షుడు కాశప్ప మాట్లాడుతూ 2016 దివ్యంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండు చేశారు.  యూనిక్ కార్డులు కొంతమందికి ఇంకా రాలేదని, అందరికి యూనిక్ కార్డులు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం, సి.డబ్ల్యూ.సి చైర్మన్ అశోక్, డి.ఎస్.హెచ్.ఓ కన్యాకుమారి, సంఘం తరపున అబ్దుల్ అజీజ్ ఖాన్, భక్తవత్సల, బుల్లెట్ సూరి, మహిళా విభాగం నుండి రాధమ్మ తో పాటు జిల్లాలోని నలుమూలల నుండి వచ్చిన దివ్యంగులు పాల్గొన్నారు.

Share This Post