దివ్యంగులు స్వయం ఉపాధి పొందేందుకు శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవాలి…

ప్రచురణార్ధం

దివ్యంగులు స్వయం ఉపాధి పొందేందుకు శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవాలి…

మహబూబాబాద్,డిసెంబర్,14.

దివ్యంగులు వివిధ ఉపాధి రంగాలలో రాణించేందుకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా మహిళ శిశు సంక్షేమం, దివ్యంగుల సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి స్వర్ణలత లెనినా ఆధ్వర్యంలో దివ్యంగులు స్వయం ఉపాధి రంగాలలో రాణించేందుకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలపై స్వచ్చంద సంస్థలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా దివ్యంగులు తాము స్వశక్తితో రాణించాలన్న ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవాలన్నారు.

ప్రయివేట్ రంగాలలో రాణించేందుకు ఉద్యోగాలకు తగినట్లుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. యూత్ ఫర్ జాబ్స్ సంస్థ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉపాధి కల్పిస్తున్నందున దివ్యంగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దళారులను నమ్మరాదన్నారు.

ముందుగా మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకొని అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలన్నారు. విద్య ఉన్న లేకపోయినా తెలివితేటలు తో వారి సామర్ధ్యం మేరకు స్వచ్చంద సంస్థలు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ఎంపిక చేసుకొని ఉపాధి పొందాలన్నారు.

దివ్యంగులలో ఆత్మధైర్యం పెంపొందించేందుకు 1800 572 8980 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, ప్రతిరోజు ఉదయం 9గంటల నుండి సాయంత్రం6 గంటల వరకు పనిచేస్తుందని ఆరోగ్యసమస్యలకు, రుణాల సహకారం లకు పరిష్కారం లభిస్తుందన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో రెయిలింగ్ తో కూడిన ర్యాంప్ లు ఏర్పాటు చేయిస్తామని, వీల్ చైర్ ఏర్పాటు చేసి తీసుకెళ్లి తీసుకు వచ్చేందుకు సహాయకారిని నియమిస్తామన్నారు.

అలాగే కార్యాలయంలలో కూర్చునేందుకు కుర్చీలు, త్రాగునీరు సౌకర్యం కల్పిస్తామన్నారు. దివ్యంగుల విజ్ఞాపన మేరకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

పట్టణంలో రోడ్ విస్తరణలో నష్టపోయిన చిరు వ్యాపారులకు సహకరిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి అంబరీష దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post