దివ్యంగుల అభివృద్దికి సంపూర్ణ సహకారం :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం.. 1 తేదిః 03-12-2021
దివ్యంగుల అభివృద్దికి సంపూర్ణ సహకారం :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 03: జిల్లాలోని దివ్యంగుల అభివృద్ధి కి అన్ని విదాల పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్బంగా భువన బ్లడ్ బ్యాంకు వారి సహాకారంతో జిల్లా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటి, ఫ్రెడ్స్ వెల్ఫెర్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించి రక్తాదాన శిబిరం కార్యక్రమంలో విశిష్ట అతిదిగా పాల్గోన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదాన శిభిర కార్యక్రమాన్ని కరోనా వైరస్ ప్రబావం వలన ఘనంగా జరుపుకోలేకపోతున్నామని, రానున్న రోజులలో ఎంతో లాంచనంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకొని సాంస్కృతిక మరియు ఆటల పోటిలను నిర్వహించుకునేలా కృషిచేయడం జరుగుతుందని పేర్కోన్నారు. అనుకోని ఆపదలతో వైద్య చికిత్స సమయంలో అవసరమయ్యే రక్తం దానానికి మీమ సైతం వచ్చిన వికలాంగుల సోసైటిని అభినందిస్తూ, అందరికి ఆదర్శంగా నిలవడమే కాకుండా మంచి సందేశాన్ని ఇచ్చారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యంగుల అభ్యన్నతికి ఎంతో కృషిచేస్తుందని, వికలాంగుల సంక్షేమ శాఖా మాత్యులు కొప్పుల ఈశ్వర్ గారు జిల్లా మంత్రి దివ్యంగుల పెన్షన్ అందించడంతో పాటు వివాహలకు, అభివృద్ది మరియు పథకాలు మొదలగు వాటిలో మినహయింపు ఇవ్వడంతో పాటు మీ అవసరాలకు సరిపోయోల వివిధ ఉపకరణాలను అందివ్వడంలో ఎంతో కృషిచేస్తున్నారని పేర్కోన్నారు.
దివ్యాంగులకు సదరము సర్టిఫికేట్ల పంపిణి సమయంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల పరిష్కారం కొరకు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి అక్కడిక్కడే సమస్యను పరిష్కరించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా దృవీకరణలలో సమస్యలు పరిష్కారం కొరకు ఇంకా ఎన్ని ఉన్నాయో సోసైటి వారు గుర్తించి వాటి పరిష్కారం చేయించేలా కృషి చేయాలని పేర్కోన్నారు. జిల్లాలోని అన్ని కార్యాలయాలలో రోస్టర్ ప్రకారం ఖాళీలను గుర్తించడం జరుగుతుందని, ఖాళీల భర్తికి తాత్కాళిక ప్రాతిపధికను భర్తికి అనుమతులు పొందినవెంటనే వాటిలో వికలాంగులకు మొదటి ప్రాదాన్యతను ఇవ్వడం జరుగుతుందని పేర్కోన్నారు.
కార్యక్రమంలో చివరగా కేక్ కట్ చేసి పలువురికి అందజేశారు. అనంతరం రక్తదానం చేసిన పలువురు వికలాంగులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జూనియర్ సివిల్ జడ్జ్ ప్రతిక్ సిహగ్, పిడి డిఆర్డిఓ వినోద్, డిపిఓ నరేష్, సిడిపిఓ తిరుమల దేవి, డిసిబిఓ హరీష్, వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గోన్నారు.

దివ్యంగుల అభివృద్దికి సంపూర్ణ సహకారం :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post