దివ్యంగుల కు పింఛను రూ.3 016 ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని మరెక్కడా ఇది లేదని షెడ్యూలు కులాల అభివృద్ధి, మైనారిటీ దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

శుక్రవారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్బంగ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని దివ్యంగుల కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మొదటగా వికలాంగులు అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో దివ్యంగులు అనే పదం చేర్చినట్లు తెలిపారు. దివ్యాంగులు అని గౌరవంగా పిలవాలని చెప్పారు. మన ప్రభుత్వం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. మీ భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి చిత్తశుద్ధితో పాటుపడ్తున్నమని. రూ.500 పింఛను,రూ.15 వందలు, ఇప్పుడు రూ.3 వేల 16కు పెంచినం.  సుమారు 5లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు..  ఇందుకు ఏటా 18 వందల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ప్రోత్సాహాకం ఇస్తున్నామన్నారు.. ఉద్యోగాలలో 2%రిజర్వేషన్లు ఇస్తున్నం. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో రిజర్వేషన్లను  3% నుంచి 5% పెంచినమన్నారు  డబుల్ బెడ్ రూం ఇండ్లలో 5% కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంధత్వం ఉన్న వాళ్లు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు ల్యాప్ టాప్స్ ఇస్తున్నామన్నారు.. మీకు కావలసిన ఉపకరణాలను ఉచితంగా ఇస్తున్నం.  ఇటీవల 21కోట్లతో 14వేల మందికి ఇస్తున్నామన్నారు.. 90వేల విలువ చేసే టూవీలర్లను కూడా అందజేసినమన్నారు..  స్మార్ట్ ఫోన్లు,వీల్ ఛైర్లు,ట్రైసైకిళ్లు అందించిన అన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు లేవు,మానవ సేవనే మాధవసేవ అని మనసారా భావిస్తూ ప్రభుత్వం మీ బాగోగులు చూస్తున్నదన్నారు.. మీరు ఆత్మన్యూనతా భావాన్ని పూర్తిగా విడనాడి ఆత్మ స్థైర్యం,ఆత్మ విశ్వాసం,దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి,ఆత్మ గౌరవాన్ని మరింత పెంపొందించుకుంటూ నిండూ నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

            ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన దివ్యంగులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. గౌరవ మంత్రివర్యులు దివ్యంగులకు బ్యాటరీ తో నడిచే మూడు చక్రాల సైకిల్ ను మరియు ఇతర పరికరాలను అందజేశారు.

             ఈ కార్యక్రమంలో హోమ్ శాఖామాత్యులు మహమూద్ అలీ, పశు సంవర్ధక, మత్స, పాడి పరిశ్రమల   శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టూరిజం, క్రీడా సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్ , కార్మిక శాఖామాత్యులు మల్లా రెడ్డి, స్పెషల్ సెక్రటరీ దివ్య దేవరాజ్, డైరెక్టర్ శైలజ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, హైదరాబాద్

????????????????????????????????????

Share This Post