దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్


దివ్యాంగుల సంక్షేమం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
3016 దివ్యాంగుల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
48 మంది లబ్ధిదారులకు ఉపకరణాలు అందజేత
స్థానిక మార్కెట్ యార్డులు దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి జనవరి 9:- దివ్యాంగుల సంక్షేమ పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి మంత్రి పాల్గొన్నారు. దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు దివ్యాంగుల సంక్షేమ పై ప్రత్యేక శ్రద్ధ వహించిన సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రూ.500/- దివ్యాంగుల పెన్షన్ ను రూ.3016/- పెంచి ప్రతిమాసం అందజేస్తున్నారని అన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని ఉద్దేశంతో వారికి అవసరమైన పరికరాలను సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి తెలిపారు. గత బడ్జెట్లో సైతం దివ్యాంగులకు పరికరాలు అందజేయడానికి సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయించారని, అర్హులైన ప్రతి దివ్యాంగులకు దశల వారీగా ఉపకరణాలను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో చివరి లబ్ధిదారుడు వరకు సంక్షేమ పథకాలు అందజేయాలనే ది సీఎం కేసీఆర్ లక్ష్యమని, అదేవిధంగా దివ్యాంగులకు సైతం ప్రతి ఒక్కరికి సాచ్యురేషన్ పద్ధతిలో ఉపకరణాలు అందజేస్తామని తెలిపారు పెద్దపెల్లి జిల్లాకు ప్రభుత్వం 274 ఉపకరణాలు సబ్సిడీపై పంపిణీకి కేటాయించిందని, వీటికోసం 194 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 130 దరఖాస్తులు ఆమోదించి ప్రస్తుతం 114 మందికి ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని, మిగిలిన వారికి సైతం త్వరలో ధ్రువీకరించి ఉపకరణాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 22 మంది దివ్యాంగులకు టీవిఎస్ జుపిటర్ వాహనాలు, 8 మంది లబ్ధిదారులకు లాప్టాప్ ,4 లబ్ధిదారులకు మొబైల్ ఫోన్ , 14 మంది దివ్యాంగ లబ్ధిదారులకు బ్యాటరీ వీల్చైర్ లను మంత్రి పంపిణీ చేశారు. దివ్యాంగుల వివాహ రాయితీని సైతం ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ లక్ష పెంచిందని, దివ్యాంగుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అర్హులైన దివ్యాంగుల అందరికీ మోటార్ వాహనాలు, బ్యాటరీ వాహనాలు మొదలైన ఉపకరణాలు అందజేస్తామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, ప్రతి లబ్దిదారునికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమత రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులుతదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

.

Share This Post