దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ అన్నారు. గురువారం తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దివ్యాంగులు ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. రూ.4.64 లక్షల విలువైన పరికరాలను లబ్ధిదారులకు అందజేశారు. నాలుగు 4 చక్రాల మోటార్ సైకిలు, 1 బ్యాటరీ వీల్ చైర్, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ————————————- జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post