దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్ లు పంపిణీ చేసిన జెడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్

దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్ లు పంపిణీ చేసిన జెడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్

ఇల్లంతకుంట మండలం రహింఖాన్ పేట గ్రామానికి చెందిన దివ్యాoగుడు ఏనుగుల రాజయ్య కు TVs స్కూటర్ ను కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందంకళా చక్రపాణి లు అందజేశారు.

ఇదే రోజు రాత్రి కొత్త చెరువు వద్ద గల పార్క్ లో కోనా రావు పేట మండలం నిమ్మపల్లికి చెందిన డిగ్రీ ద్వీతియ సంవత్సరం చదువుతున్న దివ్యాంగ విద్యార్థినీ డప్పుల శ్వేత కు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందంకళా చక్రపాణి లు అందజేశారు.

దివ్యాంగుల సహాయ ఉపకరణాల పథకంలో భాగంగా వీటిని లబ్ధిదారులకు అందజేశారు.

 

Share This Post