దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, డిసెంబరు,14 : దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. మంగళవారం డిఆర్డీఏ కార్యాలయములోని సమావేశ మందిరములో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాలకు ముఖ్య అతిదిగా హాజరైన సందర్బంగా ఆయన మాట్లడుతూ జిల్లాలో నైబర్ హుడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని పైలెట్ మండలాలు అయిన నర్మెట్ట, కొడకండ్ల మరియు రఘునాథపల్లె లలో సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశ్యం వికలత్వ లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడం, వారికి కావాల్సిన థెరపిలను (ఫిజియో థెరపి, స్పీచ్ థెరపి మరియు స్పెషల్ ఎడ్యుకేషన్) అందించి త ద్వారా వికలత్వం తగ్గించడం జరుగుతుందని దీని కొరకు ఒక్కో కేంద్రంలో సుశిక్షితులైన టీచర్, ఆయా, ఈఐ సిఆర్పి లను నియమించడం జరిగిందన్నారు. పిల్లలను ఇంటి నుండి కేంద్రానికి, కేంద్రం నుండి ఇంటికి తీసుకువెళ్ళుటకు ఉచితముగా రవాణ సౌకర్యం కల్పించామన్నారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒక సారి ఫిజియో థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ మరియు స్పెషల్ ఎడ్యుకేటర్ కేంద్రంలో పిల్లలను పరీక్షించి కావలసిన శిక్షణలను పిల్లలకు, తల్లితండ్రులకు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ మూడు కేంద్రాలలో రఘునాథపల్లిలో 35, నర్మెట్ట లో 22, కొడకండ్ల లో 26 మొత్తంగా 83 మంది పిల్లలు నమోదుచేసుకున్నారని అన్నారు.
ఈ ఆర్దిక సంవత్సరం నుండి సదరం శిబిరాలు ఏర్పాటు చేసి సర్టిఫికేట్ లను మీ సేవ లో స్లాట్ బుకింగ్ పద్దతి ద్వారా జారీ చేయడం జరుగుతుందన్నారు. స్లాట్ బుక్ చేసుకున్నవారికి జిల్లా ఆసుపత్రి జనగామ నందు 30 విడతలలో సదరం శిబిరాలు నిర్వహించగా ఈ క్యాంపులకు 640 మంది శారీరక, 116 మంది మానసిక రుగ్మతలు కలవారు, 139 మంది వినికిడి లోపం కలవారు, 85 మంది దృష్టి లోపం కలవారు మొత్తం 1018 మంది హాజరు కాగా వారిలో 596 మంది దివ్యాంగులు అర్హులు కాగా వీరందరికీ ఎలాంటి మధ్యవర్తి ప్రమేయం లేకుండా నేరుగా దివ్యాంగులకే సర్టిఫికేట్ లు ఇవ్వడం జరిగిందన్నారు. దేవుడు దివ్యాంగులకు ఓక వైకల్యం ఇస్తే మరో అద్బుతమైన శక్తి ప్రసాదిస్తాడని చెప్పారు. వారు తమకేదో వైకల్యం ఉన్నదని భాదపదకుండా జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్బంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దివ్యాంగులకు ఎక్కువ రోజులు పని కల్పించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ పథకంలో ఎక్కువ రోజులు పనిచేసిన దివ్యాంగులను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జి. రాంరెడ్డి, సంక్షేమ అధికారిణి వై. జయంతి, ఎపిడి నూరోద్దీన్, ఎంపిడిఓ హిమబిందు, డీఆర్డీఏ సిబ్బంది రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post