దివ్యాంగులు వైకల్యాన్ని అధిగమించి ముందుకు సాగుతుందడటం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో మహిళా శిశు, వయో వృద్ధులు సంక్షేమ శాఖ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొని దివ్యాంగులకు అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలలో దివ్యాంగులు కార్యాలయానికి వస్తే ఇబ్బంది పడకుండా సులభంగా ఉండేందుకు ర్యాంపులతో పాటు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి దివ్యాంగులకు అందుబాటులోకి తేవాలని మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు. అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత ప్రతి అధికారిపైనున్నదని చెప్పారు. ప్రభుత్వం తరుపు నుండి దివ్యాంగుల సంక్షేమానికి జిల్లాలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలు చేస్తున్నామని, ఇవి కాకుండానే ఇంకా వారికి చేయాల్సింది చాలా ఉందని తప్పకుండా చేస్తామని చెప్పారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. దివ్యాంగులకు అవకాశాలు కల్పించుటలో భద్రాద్రి జిల్లా ముందంజలో ఉంటుందని దివ్యాంగుల నేస్తంగా మన జిల్లాను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. చెప్పారు. దివ్యాంగులు మనం దేనిలో కూడా తక్కువ కాదని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నిరూపిస్తున్నారని చెప్పారు. ప్రపంచ స్థాయిలో నిర్వహించిన పారా ఒలంపిక్ క్రీడల్లో పాల్గొని మన దేశానికి బంగారు పథకాలు తీసుకొచ్చి భారతదేశ కీర్తిని, ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పారని చెప్పారు. దివ్యాంగుల అభివృద్ధికి అవకాశాలు, చేయూతను కల్పించుటకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తామని చెప్పారు. దివ్యాంగులపై సానుభూతి కన్నా సహకారం అందించడం చాలా ముఖ్యమని వారికి అన్ని విధాల అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగులు కమ్యూనిటీ హాలు కావాలని అడుగుతున్నారని, ప్రత్యేక కమ్యూనిటి హాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి హక్కులు కాపాడుకోవడానికి, చర్చా వేదికలు నిర్వహణకు కమ్యూనిటీ హాలు నిర్మించాలని అడిగి యున్నారని, తక్షణమే స్థల సేకరణ చేయాల్సిందిగా తహసిల్దార్కు ఆదేశాలు జారీ చేసి దివ్యాంగులకు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దివ్యాంగులకు ఉపయోగ పడే సహాయ పరికరాలు సత్వర మంజూరుతో పాటు పంపిణీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దివ్యాంగుల సంకల్ప బలం చాలా గొప్పదని, అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిని సాధించి మార్గదర్శకులుగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగులకు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీలు బర్తీ చేయుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైకల్యం అనేది మనిషకి మాత్రమేనని మనసు కాదని అవకాశాలు కల్పిస్తే వారు ఎందులో తక్కువ కాదని నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామి పథకం పనులకు నూరు శాతం హాజరైన దివ్యాంగులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న దివ్యాంగులను శాలువాలు, మెమెంటోలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. ఉపాధిహామి పథకంలో ఎక్కువ పనిదినాలు కల్పించిన 22 మంది కార్యదర్శులకు ఏపిఓలు, ఈసిలు, టిఏలకు ప్రశంసా పత్రాలు జారీ చేశారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిఈఓ సోమశేఖరశర్మ, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, జిల్లా దివ్యాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు గుండపనేని సతీష్ తదితరులు పాల్గొన్నారు

Share This Post