దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ హక్కుల పై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ హక్కుల పై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ హక్కుల పై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, ఫిబ్రవరి-22:

దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే రూపొందించబడిన దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కంపెండియమ్ -2021, తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం, 2007, దివ్యాంగుల హక్కులు తెలిపే పుస్తకాలను, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా రూపొందించబడిన క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

వృద్ధ తల్లిదండ్రుల ఆలనా పాలన పై నిర్లక్ష్యం వహించిన కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి నోటీసులు జారీ చేసి వారి బాధ్యతలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నోటీసులు జారీ చేసినను నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చర్యలు గై కొనబడతాయని తెలిపారు.

తల్లిదండ్రుల పై నిర్లక్ష్యం వహించిన వారి పై ఇప్పటి వరకు 15 కేసులు నమోదు చేయడం జరిగిందనీ తెలిపారు.

వికలాంగులు ఆత్మస్థైర్యం తో మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని, లక్ష్య సాధనకు వైకల్యం అడ్డురాదని తెలపాలని, వికలాంగులకు చేయూత నిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.

తల్లిదండ్రులను, వయోవృద్ధుల ను గౌరవించాలని, వయోవృద్ధులు గౌరవంగా జీవించేందుకు అవసరమైన ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి వయో వృద్ధుల సంక్షేమ చట్టాలను అమలు చేస్తున్నదన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్ )కుమార్ దీపక్ జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post