దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి – జిల్లా కలెక్టర్ పీ. ఉదయ్ కుమార్

గురువారం కలెక్టరేట్లో నాగర్ కర్నూలు జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ను తొలిసారిగా మర్యాదపూర్వకంగా కలిసి దివ్యాంగుల సంఘాలతో సమావేశం ఏర్పాటు దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపుటకు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ సభ్యులతో కలిసి దివ్యాంగుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భం సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ…
జిల్లాలో ఉన్న ప్రతి వికలాంగుల కుటుంబాలకు అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు చేయాలని, ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లో 5% రిజర్వేషన్ అమలు చేయాలని, జిల్లాలో ఉన్న దివ్యాంగుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన దివ్యాంగులకు కలెక్టర్‌ ఉదయ్ కుమార్, తన చైర్ నుండి వెలుపలకు వచ్చి వారితో వినతిపత్రాన్ని స్వీకరించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
త్వరలో దివ్యాంగుల తో సమావేశం నిర్వహించి, సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వారికి హామీ ఇచ్చారు.
కలెక్టర్ కు కలిసినవారిలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం సభ్యులు రవి శంకర్ రామ్మోహన్ అంజయ్య తదితరులు ఉన్నారు.

Share This Post