దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి కలెక్టర్ హరీశ్.

ప్రచురణార్థం

మేడ్చల్-మల్కాజ్గిరి,  సెప్టెంబర్- 23.

దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హరీశ్,

దీపావళి పర్వదినాన్ని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ హరీశ్ ఆకాంక్షించారు. సోమవారం దీపావళి పండగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ హరీశ్ జిల్లా ప్రజలతో పాటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటుందని ప్రతి ఒక్కరు ఎవరికీ చెడు తలపెట్టకుండా మంచిని కోరుకోవాలని మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలను అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.  ఏ కాలంలోనైనా ఎప్పటికైనా చెడుకు తావు ఉండదని మంచి చేసే వారికే దైవం కూడా సహకరిస్తుందని అన్నారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు ఈ పండగతో అందరి కళ్ళల్లో ఆనందోత్సాహకాంతులు వెదజల్లాలని అన్నారు. అలాగే  దీపావళి పండగను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం సూచించిన మేరకు ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Share This Post